5 నోటిఫికేషన్లు… 4,271 ఉద్యోగాలు… అప్లై చేయడానికి డిసెంబర్ 31 లాస్ట్ డేట్తగిన అర్హతలు ఉన్నవారికి మంచి ఉద్యోగం సంపాదించడానికి అనేక అవకాశాలున్నాయి. భారతీయ రైల్వే, ఇండియన్ ఆర్మీ, నేవీ… ఇలా అనేక ప్రభుత్వ సంస్థలు భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాయి. వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. ఇటీవల జారీ అయిన పలు నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీ. అందులో సదరన్ రైల్వే, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంటి నోటిఫికేషన్లు ఉన్నాయి. ఐదు నోటిఫికేషన్లలో మొత్తం పోస్టుల సంఖ్య 4,271. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి సరిగ్గా వారం రోజులే గడువుంది.


Southern Railway Recruitment 2019: అప్రెంటీస్ పోస్టుల భర్తీకి సదరన్ రైల్వే 3429 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. సదరన్ రైల్వే పరిధిలోకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక, పుదుచ్చెరి, అండమాన్ & నికోబార్ ఐల్యాండ్స్, లక్షద్వీప్‌ వస్తాయి
Indian Air Force Recruitment 2019: ఇక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ 249 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-AFCAT 2020 ద్వారా ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఎంపికైనవారికి హైదరాబాద్‌లోని దుండిగల్‌లో గల ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. పెళ్లికాని యువతీయువకులే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి.
Bank of Maharashtra Recruitment 2019: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 350 పోస్టుల భర్తీకి వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. జనరలిస్ట్ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఐబీపీఎస్ ద్వారా ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
NEERI Recruitment 2019: కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ అయిన నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-NEERI ఉద్యోగాల భర్తీ చేపట్టింది. 95 ప్రాజెక్ట్ అసిస్టెంట్-రీసెర్చ్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు రెండు నోటిఫికేషన్లను వేర్వేరుగా విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


SAIL Recruitment 2019: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్-SAIL మొత్తం 148 ఎగ్జిక్యూటీవ్, నాన్-ఎగ్జిక్యూటీవ్ కేడర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో మైనింగ్ ఫోర్‌మెన్, మైనింగ్ మేట్, సర్వేయర్ లాంటి పోస్టులున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ఐదు నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 31 లాస్ట్ డేట్. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *