రైల్వేలో 251 క్లర్క్ పోస్టులకు మరో నోటిఫికేషన్… పూర్తి వివరాలివే!



భారతీయ రైల్వేలో ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. క్లర్క్ పోస్టుల భర్తీకి సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 251 పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక వెబ్‌సైట్ https://www.rrccr.com/ ఓపెన్ చేసి చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 19 చివరి తేదీ. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది సెంట్రల్ రైల్వే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.


మొత్తం ఖాళీలు- 251
జూనియర్ క్లర్క్- 171
సీనియర్ క్లర్క్- 80
దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 19విద్యార్హత- జూనియర్ క్లర్క్ పోస్టుకు 12వ తరగతి పాస్ కావడంతో పాటు ఇంగ్లీష్‌లో నిమిషానికి 30 పదాలు, హిందీలో నిమిషానికి 25 పదాలు టైప్ చేయాలి. సీనియర్ క్లర్క్ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి.
అర్హత- భారతీయ రైల్వేలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి.
వయస్సు- 42 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *