లాక్‌డౌన్‌: ‘నేను జోమాటోలా పనికి మాలిన వాడినన్నారు’

 




ఓ వ్యక్తి జోమాటో పనికి మాలినదంటూ చేసిన ట్వీట్‌కు ఆ సంస్థ ఇచ్చిన సమాధానం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు జోమాటోపై ప్రశంసల జట్లు కురిపిస్తున్నారు. ‘లాక్‌డౌన్‌లో నిత్యం ఫోన్‌తో ఆడుకుంటున్న నన్ను చూసి.. జోమాటో మాదిరిగా నేను కూడా ఎందుకు పనికిరానని నా తల్లిదండ్రులు భావిస్తున్నారు. వారు తెలివైన వారు’ అంటూ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు జోమాటో ‘ప్రస్తుతం మేము కిరణా సామగ్రిని కూడా పంపిణీ చేస్తున్నాం’ అని చమత్కారంగా సమాధానం ఇచ్చింది.ఇక జోమాటో ఇచ్చిన సమాధానికి నెటిజన్లు ఫిదా అవుతూ ‘వావ్‌.. గట్టి సమాధానం’ , ‘తెలివైన సమాధానం’ మరికొందరు లాక్‌డౌన్‌లో మేము జోమాటో ఆహారాన్నికూడా ఆర్డర్‌ చేసుకుంటున్నాము అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. జోమాటో సమాధానం చూసిన ఆ ట్విటర్‌ యూజర్‌ తన ట్వీట్‌ను వెంటనే తొలగించాడు. కాగా లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కొన్ని దుకాణాదారులు ఇంటికే ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులను కూడా పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జోమాటో ఫుడ్‌ డెలివరీతో పాటు ​కిరణా సామాగ్రిని కూడా పంపిణీ చేస్తుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *