దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?

 




టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు… రెండో పెళ్ళి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న మదర్స్ డే రోజున ఆయన రెండో పెళ్ళి చేసుకున్నట్టు తెలుస్తుంది. 2017 లో దిల్ రాజు మొదటి భార్య అనిత మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండీ ఒంటరిగా వస్తున్న దిల్ రాజు… తన కూతురు హర్షిత రెడ్డి మాట మేరకు రెండో పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. దిల్ రాజు సొంత ఊరు అయిన నిజామాబాద్ జిల్లా లోని నర్సింగ్ పల్లి లో … తన ఇష్ట దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్ళి చేసుకున్నట్టు తెలుస్తుంది.ఇక నిన్న దిల్ రాజు కూడా నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రకటించాడు. అయితే వధువు ఎవరు ఏంటి అనే విషయాలు చెప్పలేదు. దిల్ రాజు వేరే కులం యువతిని రెండో పెళ్ళి చేసుకోబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల పై ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం … ఆ వార్తలే నిజమని తెలుస్తుంది. దిల్ రాజుకి పరిచయస్తురాలు అయిన వేరే కులం యువతినే వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది.ఇప్పుడు దిల్ రాజు వయసు 49. ఇప్పుడు కులాంతర వివాహం చేసుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. దిల్ రాజు రెండో పెళ్ళి… లాక్ డౌన్ కారణంగా 10 మందిలోపే సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. దంపతులకు ఫిల్మీ ఫోకస్ శుభాకాంక్షలు!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *