‘గడ్డం తీసేయాలి.. వద్దూ కావాంటే వంట నేర్చుకో’

 
బాలీవుడ్‌ యువ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ను గడ్డం ట్రిమ్‌ చేసుకోవాలని బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొనె సూచించారు. కార్తీక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం నిర్వహించిన లైవ్‌ చాట్‌ సందర్భంగా.. కార్తీక్‌ను గడ్డం తీసేయాలని దీపికా సలహా ఇచ్చారు. అయితే ఈలైవ్‌ చాట్‌లో కార్తీక్‌‌ తన గడ్డం తీసేయలా లేదా ఇలాగే ఉంచాలా అని తన అభిమానులను అడగ్గా దీనిపై దీపికా పై విధంగా స్పందించారు. అయితే కార్తీక్‌ను తన తల్లి గడ్డం తీసేయాలని.. లేదంటే ఫుడ్‌ కట్‌ అంటూ హెచ్చిరిస్తున్నట్లు చెప్పాడు. దీంతో తాను ఇప్పుడు గడ్డం తీసేయాలా వద్దా తన అభిమానులను సలహా అడిగాడు. (నాకెంతో ఇష్ట‌మైన వ్య‌క్తి ఆయ‌న: దీపిక)దీనికి దీపికా పదుకొనె.. అమ్మాయి చేయి ఎత్తిన ఎమోజీని కామెంటు చేసి.. తాను కూడా కార్తీక్‌ తల్లికే మద్దతు ఇస్తున్నానని, వెంటనే నువ్వు గడ్డం ట్రీమ్‌ చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఇక దీపికా సలహను.. ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అనైతా ష్రాఫ్‌ అడ్జానీయా ఖండిస్తూ.. నువ్వు గడ్డం తీసేయోద్దూ.. మీ అమ్మ అన్నం పెట్టకుంటే నువ్వు వంట చేయడం నేర్చుకో’ అంటూ కామెంటు చేశారు. కాగా లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన కార్తీక్‌ ఈ ఖాళీ సమాయాన్ని వృధా చేయకుండా ఇంట్లో స్వయం ఉపాధి కల్పించుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనాను అరికట్టేందుకు డాక్టర్‌లను ఇంటర్య్వూ చేస్తూ స్వయం ఉపాధిని పోందుతున్నాడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *