టెక్‌షేర్ల జోరు..ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ 7% అప్‌

శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి.మధ్యహ్నాం12:20 గంటల ప్రాంతంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1శాతం లాభపడి రూ.13,809.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఉదయం సెషన్‌లో రూ.13,622.25 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీఐటీ ఇండెక్స్‌ రూ.13,854.90 వద్ద గరిష్టాన్ని, రూ.13,571.65 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ 7.8 శాతం లాభపడి రూ.1,555.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూ.337.4 కోట్ల బైబ్యాక్‌ ఆఫర్‌ మే 29 నుంచి ప్రారంభమవుతుందని రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో ఈ కంపెనీ వెల్లడించడంతో ఈ కంపెనీ షేర్లు లాభల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.
ఈ ఇండెక్స్‌లో భాగమైన ఇన్ఫోసిస్‌ 2.6 శాతం లాభంతో రూ.689.8 వద్ద, మైండ్‌ట్రీ 2శాతం లాభంతో రూ.902 వద్ద, జస్ట్‌డయల్‌ 1 శాతం లాభంతో రూ.353 వద్ద, టెక్‌ మహీంద్రా 0.79 శాతం లాభపడి రూ.524.15 వద్ద, టీసీఎస్‌ 0.75 శాతం లాభంతో రూ.2,006 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లోని కొన్ని షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. వీటిలో హెక్సావేర్‌ 1శాతం నష్టంతో రూ.236 వద్ద, టాటా ఎలక్సీ 0.45 శాతం నష్టంతో రూ.768 వద్ద, విప్రో 0.5శాతం నష్టంతో రూ.188 వద్ద, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 0.6శాతం నష్టంతో రూ.531 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *