అతిపెద్ద డైనోసార్‌ శిలాజం

0
281
Spread the love

మానవ ఆవిర్భావానికి కొన్ని వేల సంవత్సరాల ముందు భూమిపై రాక్షస బల్లుల పెత్తనం కొనసాగింది. శతాబ్దాలు కొనసాగిన ఈ డైనోసార్ల డామినేషన్‌కు ఆకస్మికంగా భూమిపై విరుచుకుపడ్డ ఉల్కాపాతం చెక్‌ పెట్టింది. డైనోసార్లు పూర్తిగా అంతరించిన వేల సంవత్సరాలకు భూమిపై మనిషి ఆధిపత్యం మొదలైంది. సైన్సు పురోగతి సాధించేకొద్దీ రాక్షసబల్లులపై పరిశోధనలు పెద్ద ఎత్తున కొనసాగాయి. వివిధ ప్రాంతాల్లో వీటి శిలాజాలు వెలికి తీయడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా అతిపెద్ద డైనోసార్‌ శిలాజాన్ని వెలికి తీశారు. దాదాపు 9.8 కోట్ల సంవత్సరాల వయసున్న ఈ శిలాజం అర్జెంటీనాలో లభించింది. సౌరోపాడ్‌ గ్రూప్‌నకు చెందిన డైనోసార్‌కు చెందిన ఈ శిలాజ ఎముకలు ఒక్కోటి మనిషి సైజులో ఉన్నాయి. ఇప్పటివరకు పటగొటియన్‌ మయోరమ్‌ అనే డైనోసార్‌నే అతిపెద్ద డైనోసార్‌గా భావించారు.కానీ తాజా శిలాజం ఎముకలు ఈ పటగొటియన్‌ కన్నా 10– 20 శాతం పెద్దవిగా ఉన్నాయని సీటీవైఎస్‌ సైంటిఫిక్‌ ఏజెన్సీ తెలిపింది. సౌరోపాడ్‌ గ్రూప్‌ డైనోసార్లు పెద్ద శరీరంతో, పొడవైన మెడ, తోకతో తిరిగేవి. ఇవి శాకాహారులు. భూమిపై ఇంతవరకు జీవించిన ప్రాణుల్లో ఇవే అతిపెద్దవి. వీటిలో పటగొటియన్‌ 70 టన్నుల బరువు, 131 అడుగుల పొడవు ఉండేది. తాజా శిలాజం ఏ డైనోసార్‌కు చెందిందో ఇంకా గుర్తించాల్సి ఉంది. ఇప్పటివరకు కొన్ని శరీరభాగాలకు చెందిన ఎముకలు మాత్రమే వెలికి తీయడం జరిగింది. పూర్తిగా వెలికితీత పూర్తయి డైనోసార్‌ను గుర్తించేందుకు మరికొన్నేళ్లు పడుతుందని శిలాజ శాస్త్రవేత్త జోస్‌ లూయిస్‌ కార్బల్లిడో అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here