నవాజ్‌ షరీఫ్‌కు బిన్‌ లాడెన్‌ ఆర్థిక సాయం

0
283
Spread the love

అల్‌ఖైదా అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌కు ఆర్థిక సాయం అందిస్తుండేవాడని అమెరికాలో పాక్‌ మాజీ రాయబారి సయీదా అబిదా హుస్సేన్‌ తాజాగా బయటపెట్టారు.

Osama Bin Laden funded Nawaz Sharif - Sakshi

ఆమె గతంలో నవాజ్‌ షరీఫ్‌ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. ‘‘అవును, లాడెన్‌ ఒక విషయంలో నవాజ్‌ షరీఫ్‌కు మద్దతిచ్చాడు. అదొక సంక్లిష్టమైన కథ. అంతేకాకుండా నవాజ్‌ షరీఫ్‌కు లాడెన్‌ తరచుగా ఆర్థిక సాయం అందిస్తుండేవాడు’’ అని సయీద్‌ అబిదా హుస్సేన్‌ ప్రైవేట్‌ న్యూస్‌ చానెల్‌ జీయో టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. బిన్‌ లాడెన్‌ను అమెరికా నేవీ సీల్స్‌ బృందం 2011 మేలో పాకిస్తాన్‌ భూభాగంలోనే హతమార్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ పాలకులే అతడికి ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here