షాకింగ్‌: బ్రేకప్‌ చెప్పేసిన స్టార్‌ సింగర్‌

0
272
Spread the love

అమెరికన్‌ స్టార్‌ సింగర్‌, నటి జెన్నిఫర్ లోపెజ్‌ (51)కు సంబంధించి మరో వార్త ‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రియుడు, ప్రముఖ క్రీడాకారుడు అలెక్స్ రోడ్రిగెజ్‌(45)తో తెగదెంపులు చేసుకుందిట. గతకొన్ని రోజులుగా వీరిద్దరి బ్రేక్‌పై పలు ఊహాగానాలు చెలరేగాయి. దీనికి తోడు వీరిద్దరూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన లేటెస్ట్‌ ఫోటోలు ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేయడంతోపాటు, ఈ అంచనాలకు మరింత బలం చేకూర్చాయి. గతవారమే వీరిద్దరూ తమ ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్‌ చేసుకున్నట్టు యూఎస్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను జేఎల్‌ఓగానీ, అలెక్స్‌గానీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

Jennifer Lopez, Alex Rodriguez Break Off Engagement: Report - Sakshi

జెన్నిఫర్,అలెక్స్ దాదాపు నాలుగు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మయామిలో 40 మిలియన్ డాలర్ల ఇంటిని కూడా కొనుక్కున్నారు. లోపెజ్ డొమినికన్ రిపబ్లిక్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రెండేళ్లకు పైగా డేటింగ్ చేసిన తర్వాత ఇద్దరూ 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే కరోనావైరస్ మహమ్మారి కారణంగా పెళ్లిని రెండుసార్లు వాయిదా వేసుకున్నామని స్వయంగా జెన్నిఫర్‌ గత డిసెంబర్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. చార్మ్ స్టార్ మాడిసన్ లెక్రోయ్‌తో అలెక్స్‌ చెట్టాపట్టాలేసుకుని తిరగుతున్నాడన్నకారణంగానే జెలో ఈ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here