30 పిల్లల తండ్రి… రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడు… ఎలా?

0
442
Spread the love

ఆఫ్రికా దేశాలు అనగానే… మనకు పేదరికం, ఆకలి చావుల వంటివి కళ్లముందు కనిపిస్తాయి. అవి నిజమే. కానీ… అదే ఆఫ్రికాలో అత్యంత సంపన్నులు కూడా ఉన్నారు. మన దేశంలో లాగే అక్కడ కూడా మనుషుల మధ్య ఆర్థక వ్యత్యాసాలు భారీగా ఉన్నాయి. ఆ టాపిక్ అలా ఉంచితే… ఆఫ్రికా దేశమైన టాంజానియాలో ఓ తండ్రి గురించి మనం చర్చించుకుందాం. ఆయన ఓ గని యజమాని… రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడు. జూన్‌లో ఆయన రెండు రాళ్లు అమ్మాడు. ఒకటి 9.2 కేజీలుంది. మరొకటి 5.8 కేజీలుంది. వాటితో రూ.25 కోట్లు సంపాదించాడు. ఎందుకంటే అవి మామూలు రాళ్లు కావు. ఆ రాళ్లు అత్యంత ఖరీదైన టాంజనైట్ (Tanzanite) ఖనిజంతో ఉన్నవి. తాజాగా మరో రాయి అమ్మాడు. మరో రూ.14 కోట్లు వెనకేసుకున్నాడు. సానినూ లైజర్‌ దగ్గర మరికొన్ని రాళ్లు ఉన్నాయి. అవి 6.3 కేజీల బరువున్నాయి. అవి కూడా అమ్మితే ఇక డబ్బే డబ్బు.

అరుదైన వజ్రపు రాళ్లు : టాంజనైట్ అనేది ఎక్కడ బడితే అక్కడ దొరకదు. భూమిపై అరుదైన వజ్రపు రాళ్లలో ఇవీ ఒకటి. వచ్చే 20 ఏళ్ల తర్వాత ఇక ఎంత వెతికినా ఈ రాళ్లు కనిపించకపోవచ్చని భూగర్భ పరిశోధకులు చెబుతున్నారు. ఈ రాళ్లు రకరకాల రంగుల్లో ఉంటాయి. మెరుస్తాయి. రెడ్, గ్రీన్, పర్పుల్, బ్లూ కలర్స్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటాయి. అరుదైనవి కాబట్టి రేటు కూడా అదిరిపోతోంది. రాయి అరుదైనది కావడంతోపాటూ… దాని రంగును బట్టి కూడా ధర డిసైడవుతోంది.

సానినూ లైజర్‌ మంచివారు. స్థానిక చిన్న చిన్న గనుల యజమానులను పిలిచి… మీరు కూడా ప్రభుత్వ అనుమతి తీసుకొని… బాగా వెతకండి. మీకూ ఇలాంటివి దొరికే ఛాన్సుంది అని చెప్పారు. లైజర్ తన రాళ్లను ప్రభుత్వానికే అమ్మారు. తద్వారా ఎలాంటి అక్రమాలూ లేకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే టాంజానియాలో గనుల మోసాలు చాలా జరుగుతున్నాయి. త్వరలోనే తన 30 మంది పిల్లలకూ అదిరిపోయే పార్టీ ఇస్తానని లైజర్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here