అందుకే ఎక్కువగా ఫోకస్ చెయ్యలేకపోతున్నాం

0
157
Spread the love

విజయవాడ : కరోనా వ్యాక్సిన్‌ని సమర్థవంతంగా అందిస్తున్నాం అని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు.

Effectively Providing Corona Vaccine Says Deputy CM Alla Nani

ఇప్పటికే 3,88,327 మందికి గాను 1,89,890 మందికి వ్యాక్సిన్ వేశామని, 48.90 శాతం మందికి మొదటి దశలో వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 74 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వాక్సినేషన్ రియాక్షన్ వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఒంగోలులో వ్యాక్సిన్‌ తీసుకున్న డెంటర్‌ డాక్టర్‌ ధనలక్ష్మి అస్వస్థతకు గురైతే వైద్యం అందించేందుకు ప్రభుత్వమే ఆమెను చెన్నైకి తరలించినట్లు తెలిపారు. 2,102 సెషన్ సైట్స్ సిద్ధంగా ఉంచామని, మరో 3,181 సెషన్ సైట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. హెల్త్ వర్కర్స్, డాక్టర్లలో కొంత అనుమానాలు ఉన్నందున వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదదని, ఎన్నికల నిర్వహణ వలన ఎక్కువగా ఫోకస్ చెయ్యలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here