‘అంబానీ’ పేలుళ్ల కేసు.. ఎవరి దర్యాప్తు వారిదే!

0
160
Spread the love

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కేసులో మహారాష్ట్ర పోలీసు అధికారుల చుట్టూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఉచ్చు బిగిస్తోంది. ఇంకోవైపు.. రాష్ట్ర పోలీ్‌స (యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌-ఏటీఎ్‌స)ల దర్యాప్తు కొనసాగుతుందని మహారాష్ట్ర హోంమంత్రి అనీల్‌ దేశ్‌ముఖ్‌ స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో కేంద్రం వర్సెస్‌ రాష్ట్రం అనేది నిరూపితమైంది. రక్షించుకోవాలని రాష్ట్రం.. కక్ష తీర్చుకోవాలని కేంద్రం కదులుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల అసిస్టెంట్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌, ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ సచిన్‌ వాజేను ఎన్‌ఐఏ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం అసలు నంబరు ప్లేటు సచిన్‌ వాజే సొంత వాహ నంలో లభించినట్లు ఎన్‌ఐఏ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ తరుణంలో ఆయనే కేంద్ర బిందువుగా ఎన్‌ఐఏ దూకుడు పెంచింది. ఈ కేసులో మరో పోలీసు అధికారిని అరెస్టు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. క్రైం ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(సీఐయూ)లోని వాజే కార్యాలయాన్ని ఎన్‌ఐఏ అధికారులు మంగళవారం.. రోజంతా జల్లెడ పట్టారు. కొన్ని నేరపూరిత పత్రాలు.. ల్యాప్‌టాప్‌, ఐపాడ్‌, మొబైల్‌ ఫోన్ల వంటి ఎలకా్ట్రనిక్‌ ఆధారాలను స్వాధీనం చేసుకొన్నారు. సీఐయూలోని అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ రియాజుద్దీన్‌ కాజీని ప్రశ్నించారు. వాహనం గుర్తించిన సరిగ్గా రెండు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 27న.. వాజే నివశిస్తున్న థానేలో ని సాకేత్‌ ప్రాంతంలో ఉన్న హౌసింగ్‌ సొసైటీలోని సీసీ ఫుటేజీల డీవీడీలను కాజీ తీసుకొన్నారు. అయితే, స్వాధీ నం చేసుకొన్న ఆధారాల జాబితాలో వాటిని ఆయన చూపలేదు. వాజే ను రక్షించడంలో భాగంగా ఆ కీలక ఆధారాలను నాశనం చేసే ఉద్దేశంతోనే అలా చేసి ఉండొచ్చని ఎన్‌ఐఏ అధికారి చెప్పారు. పేలుడు పదార్థాలున్న వాహనంలో దొరికిన తప్పుడు నంబరు ప్లేట్లను కూడా కాజీనే సమకూర్చినట్లు అనుమానిస్తున్నామన్నా రు. వాహనం గుర్తించిన రోజు (ఫిబ్రవరి 25న) సీసీ ఫుటేజీలో ఆ రోడ్డులో అనుమాస్పదంగా కనిపించిన వ్యక్తి ఒక పోలీసు అని.. దీనిని ఫోరెన్సిక్‌ నివేదిక నిర్ధారించాల్సి ఉందన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌తోసహా పలువురు పోలీసులను ఎన్‌ఐఏ ప్రశ్నించింది. మహారాష్ట్ర హోం మంత్రి అనీల్‌ దేశ్‌ముఖ్‌ను ఏడీజీపీ రజనీశ్‌ సేథ్‌ మంగళవారం కలిశారు. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌తో కూడా చర్చించారు.

శివాలెత్తుతున్న శివసేన

మహారాష్ట్ర పోలీ్‌సలు ఉండగా.. ఎన్‌ఐఏ దర్యాప్తు ఏమిటని.. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చే స్తోందని శివసేన శివాలెత్తుతోంది. ఆ పార్టీ పత్రిక సా మ్నాలోని సంపాదకీయం ద్వారా ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. మరోవైపు.. బీజేపీ నాయకులు కూడా అదే స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. సీఎం ఉద్దవ్‌ ఠాక్రే కుమారుడైన ఆదిత్యఠాక్రే కజిన్‌ వరుణ్‌ సర్దేశాయ్‌తో వాజేకు సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే నితీశ్‌ రాణే తీవ్రమైన ఆరోపణలు చేశారు. క్రికెట్‌ బెట్టింగ్‌ చేస్తున్న వాళ్లను వాజే బెదిరించి వసూలు చేసే సొమ్ములో కొంత భాగం వరుణ్‌కు వెళ్లేదని రాణే పేర్కొన్నారు. వాజేకు గత ఏడాది జూన్‌ 6న పోస్టింగ్‌ ఇవ్వడం వెనుక ఉన్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని బీజేపీ మాజీ ఎంపీ కిరీట్‌ సోమయ డిమాండ్‌ చేశారు. కాగా, రాజకీయ రగడలో తనను బలి పశువును చేస్తున్నారం టూ వాజే హైకోర్టును ఆశ్రయించారు.

ఎవరీ వాజే..

1990 బ్యాచ్‌కు చెందిన రాష్ట్ర క్యాడర్‌ పోలీసు అధికారి సచిన్‌ వాజే. ఎన్‌కౌంటర్లతోనే పేరు గడించిన అధికారి. తొలుత నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం గడ్చిరోలిలో పని చేశారు. అక్కడి నుంచి థానే బదిలీ అయ్యారు. పెద్ద కేసుల దర్యాప్తులను పర్యవేక్షించేవారు. మొత్తం 63 మంది ని ఎన్‌కౌంటర్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా పేరు సంపాదించారు. 2002లో జరిగిన ఘట్‌కోపర్‌ పేలుళ్ల కేసులో ఖాజా యూనస్‌ అనే ఇంజనీరును అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో అతడు మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టు ఆదేశాలతో 2004లో వాజేను విధుల నుంచి తప్పించారు. అప్పటి నుంచీ పోస్టింగ్‌ రాకపోవడంతో శివసేనలో చేరారు. 2008 వరకూ శివసేనలో వాజే ఉన్నారని శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవల చెప్పారు.

శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత ఏడాదిలో వాజేను మళ్లీ విధుల్లో తీసుకొన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో పోలీ్‌సల అవసత దృష్ట్యా అయనకు క్రైం బ్రాంచ్‌లోని క్రైం ఇంటెలిజెన్స్‌ యూనిట్‌లో విధులు అప్పగించారు. అదే ఏడాది నవంబర్‌లో రిపబ్లిక్‌ చానెల్‌ అధినేత అర్ణబ్‌ గోస్వా మి అరెస్టు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కేసు దర్యాప్తు బృందానికి వాజే నేతృత్వం వహించారు. కారు డిజైనర్‌ దిలీప్‌, టీఆర్పీ కుంభకోణం, హృతిక్‌ రోషన్‌కు ఫేక్‌ ఈమెయిల్‌ వంటి పెద్ద కేసులను వాజే పర్యక్షించారు.

కారు కథేమిటి?

గత నెల 25న ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో నిలిపి ఉన్న ఒక స్కార్పియోలో 20జిలెటిన్‌ స్టిక్స్‌ ఉండడాన్ని గుర్తించారు. కారు యజమాని పేరు శ్యామ్‌ న్యూటన్‌. కార్ల ఇంటీరియల్‌ డిజైనర్‌ అయిన మన్సుఖ్‌ హీరేన్‌ వద్ద తన కారుకు ఇంటీరియల్‌ డిజైన్‌ చేయించుకొన్నాడు. తర్వాత న్యూటన్‌ డబ్బులు ఇవ్వలేదు. దీంతో ఆ కారు మన్సుఖ్‌ వద్ద ఉండిపోయింది. తర్వాత అది మన్సుఖ్‌ నుంచి తీసుకొని వాజే వాడుతున్నట్లు చెబుతున్నారు. తన కారు పోయిందని సంఘటనకు వారం ముందు ము న్సుఖ్‌ ఫిర్యాదు చేశాడు. అయితే, ఆయన పోయిందని చెబుతున్న ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు.

మన్సుఖ్‌ మరణంతో..

ఈ కేసు దర్యాప్తును తొలుత యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ పోలీస్‌లు మొదలు పెట్టారు. ఈ నెల 5న ముంబై నుంచి థానే వెళ్లే దారిలో సముద్రపు పాయలో మన్సుఖ్‌ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. మన్సుఖ్‌కు ఈత వచ్చని, ఆయన మరణంలో వాజే పాత్ర ఉందని మన్సుఖ్‌ భార్య విమల ఆరోపించింది. ఆ తర్వాత ఈ కేసును ఎన్‌ఐఏకు కేంద్రం అప్పగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here