అమెజాన్‌ సారథ్యానికి బెజోస్‌ బైబై

0
215
Spread the love

ఈ ఏడాది మూడో త్రైమాసికం లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అమెజాన్‌ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) జెఫ్‌ బెజోస్‌ ప్రకటించారు. అనంతరం బోర్డు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ హోదాలో కొనసాగనున్నట్లు తెలిపారు.

తద్వారా ఇతర వ్యాపారాలు, అభిరుచులపై దృష్టి పెట్టేందుకు తగిన సమయం, శక్తి లభిస్తుందని అమెజాన్‌ ఉద్యోగులకు రాసిన లేఖలో బెజోస్‌ పేర్కొన్నారు. అమెజాన్‌ కొత్త సీఈఓగా ఆండీ జస్సీ బాధ్యతలు చేపట్టనున్నట్లు బెజోస్‌ ప్రకటించారు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ పట్టా పొందిన 53 ఏళ్ల జస్సీ.. 1997లో అమెజాన్‌లో చేరారు. కంపెనీ క్లౌడ్‌ సేవల విభాగమైన అమెజాన్‌ వెస్‌ సర్వీసె్‌సకు ప్రారంభం(2002) నుంచి సారథ్యం వహిస్తున్నారు.

ఇంతింతై..అమెజాన్‌ ఇంతై…

జెఫ్‌ బెజోస్‌ 1995లో పుస్తకాల ఆన్‌లైన్‌ విక్రయ వేదికగా అమెజాన్‌ను ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు.. గడిచిన 27 ఏళ్లలో అమెజాన్‌ ప్రపంచ ఈ-కామర్స్‌ దిగ్గజంగా ఎదిగింది. దాంతో బెజోస్‌ విశ్వ కుబేరుడయ్యారు. ప్రపంచ ధనికుల జాబితాలో చాన్నాళ్లపాటు అగ్రస్థానంలో కొనసాగిన బెజో్‌సను టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ ఈమధ్యనే వెనక్కినెట్టారు. గత ఏడాది అమెజాన్‌ నికర విక్రయాలు 38 శాతం వృద్ధి చెంది 38,610 కోట్ల డాలర్లకు పెరిగాయి. ప్రస్తుతం అమెజాన్‌కు 40కు పైగా అనుబంధ విభాగాలున్నాయి.

అమెరికాలోని ఐదు అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల్లో అమెజాన్‌ ఒకటి. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, ఫేస్‌బుక్‌ టాప్‌-5లోని ఇతర కంపెనీలు.

ఆదాయం, మార్కెట్‌ విలువ పరంగా అమెజాన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌ప్లేస్‌, ఏఐ అసిస్టెంట్‌ ప్రొవైడర్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫామ్‌.

ఆదాయపరంగా ప్రపంచంలో అతిపెద్ద ఇంటర్నెట్‌ కంపెనీ. అమెరికాలో రెండో అతిపెద్ద ప్రైవేట్‌ ఎంప్లాయర్‌.

ప్రపంచంలో అత్యంత ప్రభావిత ఆర్థిక, సాంస్కృతిక శక్తుల్లో అమెజాన్‌ ఒకటి.

ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్లలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఈమధ్యనే యాపిల్‌ అగ్రస్థానానికి చేరుకుంది.

భారత్‌లో అమెజాన్‌ ప్రస్థానం

2013 జూన్‌: ఇండియాలో అమెజాన్‌ మార్కెట్‌ ప్లేస్‌ సేవలు ప్రారంభం

2014 జూలై: భారత్‌లో ఈ-కామర్స్‌ వ్యాపార విస్తరణ కోసం 200 కోట్ల డాలర్ల పెట్టుబడుల ప్రకటన

2016 ఫిబ్రవరి: అమెజాన్‌ నౌ పేరుతో రెండు గంటల్లో కిరాణా సరుకుల డెలివరీ సేవలు ప్రారంభం. 2018మే దీన్ని ప్రైమ్‌ నౌ, 2019 ఆగస్టులో అమెజాన్‌ ఫ్రెష్‌గా పేరు మార్చారు.

2016 జూన్‌: భారత్‌లో కార్యకలాపాల విస్తరణ కోసం మరో 300 కోట్ల డాలర్ల పెట్టుబడుల ప్రకటన.

2016 జూలై: అమెజాన్‌ ప్రైమ్‌ ప్రారంభం

2016 డిసెంబరు: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రారంభం

2018 మార్చి: అమెజాన్‌ ప్రైమ్‌ మ్యూజిక్‌ లాంచింగ్‌

2018 సెప్టెంబరు: అమెజాన్‌, సమారా క్యాపిటల్‌ కలిసి ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన మోర్‌ సూపర్‌ మార్కెట్ల వ్యాపారం రూ.4,050 కోట్లకు కొనుగోలు

2019 ఆగస్టు: ఫ్యూచర్‌ గ్రూప్‌ ప్రమోటింగ్‌ కంపెనీల్లో ఒకటైన ఫ్యూచర్‌ కూపన్స్‌లో 49 శాతం వాటా రూ.1,500 కోట్లకు కొనుగోలు. తద్వారా ఫ్యూచర్‌ రిటైల్‌లోనూ పరోక్ష వాటా దక్కించుకుంది. ప్రస్తుతం ఫ్యూచర్‌ గ్రూప్‌-అమెజాన్‌కు మధ్య వివాదం నడుస్తోంది.

2019 ఆగస్టు: ప్రపంచంలో అమెజాన్‌కు చెందిన అతిపెద్ద క్యాంపస్‌ హైదరాబాద్‌లో ప్రారంభం

2020 జనవరి: భారత్‌లో చిన్న, మధ్య తరహా వ్యాపారాల (ఎ్‌సఎంబీ) డిజిటలీకరణ కోసం 100 కోట్ల డాలర్ల పెట్టుబడుల ప్రకటన. కస్టమర్లకు వస్తువుల డెలివరీ కోసం 2025నాటికి 10వేల విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు బెజోస్‌ వెల్లడి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here