అసోం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బూత్ అధ్యక్షుడు శుక్రవారం రాత్రి కత్తిపోట్లతో హత్యకు గురయ్యాడు.అసోం రాష్ట్రంలోని తిన్ సుకియా జిల్లా బూహిదిహింగ్ గ్రామపంచాయతీకి చెందిన బీజేపీ బూత్ అధ్యక్షుడు దేబానంద గగోయ్ కత్తిపోట్లకు గురయ్యారు.కత్తిపోట్లతో బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుడు మరణించిన ఘటనను అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఖండించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితులను పట్టుకోవాలని సీఎం సోనోవాల్ డీజీపీని ఆదేశించారు.బీజేపీ అధ్యక్షుడిని హత్య చేసిన కేసులో నిందితుడైన జయచంద్ర గగోయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి డాగర్ ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బూత్ అధ్యక్షుడి హత్య జరగడం అసోంలో సంచలనం రేపింది.
