అప్పుల్లో ఏపీ టాప్ .. మ‌రింత గా సామాన్యుడిపై ప‌న్నులు.. ఆందోళ‌న దిశ‌గా ఏపీ ఆర్థికం

0
182
Spread the love

అప్పు చేసి పప్పు కూడు అనే సామెత ఒకటి ఉంది. ఏపీలో రుణ భారాన్ని చూస్తే ఇదే సామెత ఇప్పుడు గుర్తుకు వస్తోంది. ఏపీ ప్రభుత్వ రుణ భారం భారీగా పెరిగింది. ఇప్పటికే ఏపీ అప్పుడు రూ.3.7 లక్షల కోట్లు దాటేసింది.

ఏపీ అప్పులు పెరుగుతూనే వస్తున్నాయి. రుణ భారం కొండలా పెరిగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు స్థూల రుణ భారం ఏకంగా రూ.3,73,140 కోట్లకు చేరిపోయింది. 2020 నవంబర్ చివరి నాటికి ఏపీకి ఈ స్థాయిలో అప్పు ఉంది. కాగ్ లేటెస్ట్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది.

NewsSting - Jagan faces BJP's criticism for using public money

వాస్తవానికి 2020-21లో ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పులు రూ.48,296 కోట్లు. అయితే, ఈ ఏడాది జనవరి నాటికే(మూడో త్రైమాసికం) ఈ అప్పులు రూ.73,913 కోట్లకు చేరాయి. అంటే బడ్జెట్‌ అంచనాలను 153ు మించి జగన్‌ సర్కార్‌ అప్పులు చేసింది. ఇదే విషయాన్ని ఇటీవల కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) ప్రధానంగా ప్రస్తావించింది. ఇక, 2019-20లో కూడా ఏపీ ప్రభుత్వం ఇదే బాటలో నడవడం గమనార్హం. ఆ ఏడాది ఏకంగా 131.88 శాతం మించి అప్పులుచేసింది. ఆయా విషయాలను కేంద్ర ఆర్థిక శాఖ త్రైమాసిక రుణ నిర్వహణ నివేదిక వెల్లడించింది.

ఏపీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. పారిశ్రామిక, సేవా రంగాలు గతంలో పోల్చితే ఇప్పుడు పూర్తిగా పడిపోయాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక వృద్ధి అంతగా జరగలేదనేది నిపుణుల మాట. అలాగే టీడీపీ హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అనేక పరిశ్రమలు కూడా కూడా వైసీపీ ప్రభుత్వ విధానాలు చూసి వెనక్కి తగ్గడం ఇబ్బందికరంగా మారిందంటున్నారు విశ్లేషకులు. జగన్‌ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు.. మార్కెట్‌లో ఏపీ అంటే నమ్మకంలేని స్థితికి తీసుకెళ్లాయి కాబట్టే ఈ పరిస్థితి వచ్చిందని TDP సహా విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో.. ఏపీలో పారిశ్రామికభివృద్ధి జరిగి ఖజానాకు ఆదాయం పెరగడం ఇప్పట్లో కనిపించేలా లేదని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం తీసుకుంటున్న రుణాల చెల్లింపు ఎలా అనేది సమస్య ఒక ఎత్తయితే… భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు నిధులను సమీకరించడం ఎలా అనేది మరో సమస్య. FRBM చట్టం విధించే పరిమితులతో పాటు, ప్రస్తుతం పేరుకుపోయిన రుణాలను చెల్లించలేని స్థితి కూడా ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుందని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రాబోయే కాలంలో రాష్ట్రం పూర్తిగా దివాళా తీయొచ్చని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఓ వైపు ఆదాయం పెరగకపోగా.. సంక్షేమ పథకాలన్నీ రాష్ట్ర ఖజానాపై గుదిబండగా మారుతున్నాయి. మరోవైపు పెరుగుతున్న అప్పులు… రాష్ట్ర భవిష్యత్తు ఏమిటా అని ఆందోళన కలిగిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here