జిల్లాలోని యాదమరి మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగుల దాడిలో ఒకరు మృతి చెందారు. యాదమరి మండలం బోధ గుట్టపల్లి పంచాయతీ పరిధిలోని తంజావూరుకు చెందిన దివ్యాంగుడు వెళ్లిగాన్(45) ఏనుగుల దాడిలో మృతి చెందాడు. గ్రామ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిపై ఏనుగులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల దాడితో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
