‘టోల్‌’ తీయడానికి రెడీ!

0
244
Spread the love

ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి రహదారుల నిర్వహణ భారంగా మారుతోంది. అందుకే టోల్‌ఫీజుల వసూలుపై దృష్టిపెట్టింది. దీనికోసం రాష్ట్ర ప్రధాన రహదారులను సిద్ధం చేస్తోంది. వాటిని రెండు, నాలుగు వరసల్లో అభివృద్ధి చేసి.. ఆపై టోల్‌ వసూలుకు తెరలేపనుంది. ఈ మేరకు తొలుత 10 రోడ్లను ఎంపిక చేసి వాటి అభివృద్ధికి టెండర్లు పిలిచారు. ఈనెల 18 వరకు బిడ్‌లు దాఖలు చేయొచ్చని ఆర్‌అండ్‌బీ టెండర్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ రహదారులు సిద్ధం కాగానే టోల్‌ వసూలుకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. వాస్తవానికి నిండుకుంటున్న ఖజానాను మళ్లీ గాడిన పెట్టేందుకు సర్కారు టోల్‌ వసూలు చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబరు 6న ‘ఆంధ్రజ్యోతి’ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తూ ‘ఆంధ్రులకు జగనన్న టోల్‌ కానుక’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది.

అదే నెల 19న సర్కారు ఏపీ స్టేట్‌ రోడ్‌ టోల్‌ పాలసీని ప్రకటిస్తూ రోడ్లు భవ నాల శాఖ ఉత్తర్వులు (జీవో-22) జారీచేసింది. ఇప్పటికే ఉన్న రాష్ట్ర ప్రధాన రహదారుల (స్టేట్‌ హైవే్‌స)ను నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి, విస్తరణ చేపట్టి.. వాటిపై టోల్‌ ప్లాజాలు ఏర్పాటు చేయాలన్నది ఆ పాలసీ సారాంశం. రాష్ట్రంలో నిర్మాణం, నిర్వహణ, బదలాయుంపు(బిఓటీ) ప్రాతిపదికన నిర్మించిన ఒకటి రెండు రహదారులపై ఇప్పటికే టోల్‌ వసూలు చేస్తున్నారు.

టోల్‌ పాలసీ ప్రకారం మెరుగులు..

రాష్ట్రంలో 14,722 కి.మీ. మేర ప్రధాన రహదారులున్నాయి. ఇప్పటికిప్పుడు వీటన్నింటిపై టోల్‌ వసూ లు చేయరు. రెండు, నాలుగు వరసల్లో ఉన్న పెద్ద రహదారులను ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేశాక టోల్‌కు సిద్ధం చేస్తారు. ఏపీ టోల్‌ పాలసీ ప్రకారం ఇప్పటికే 35 రహదారులను ఎంపిక చేసినట్లు తెలిసింది. వాటిలో 10 రహదారులను టోల్‌పాలసీ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తారు. ప్రకాశంలో 3, పశ్చిమగోదావరిలో 2, గుంటూరులో 2, వైఎ్‌సఆర్‌ కడప, కర్నూలు, చిత్తూరులో ఒక్కొక్కటి చొప్పున రహదారి అభివృద్ధికి ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ పద్ధతిలో టెండ ర్లు పిలిచారు. ఈ నెల 18 వరకు బిడ్‌లు స్వీకరిస్తారు. రహదారుల అభివృద్ధి అంటే ఇప్పటికే వినియోగంలో ఉన్న రోడ్లకు టోల్‌పాలసీ ప్రకారం మెరుగులు దిద్దుతారు. రోడ్లపై బ్లాక్‌స్పాట్‌లను తొలగిస్తారు. కొంత మేర వెడల్పు చేస్తారు. టెండర్లు పూర్తయిన వెంటనే ఒక్కో రోడ్డు అభివృద్ధి రెండు మూడు నెలల్లోనే పూర్తి కానుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here