మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు.

ఎస్‌ఈసీ నుంచి తనకు ఇంకా ఆదేశాలు రాలేదని తెలిపారు. ఎస్‌ఈసీ ఆర్డర్స్‌ను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తాను రాజకీయాలు మాట్లాడను, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోనని డీజీపీ పేర్కొన్నారు. పంచాయతీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ షాక్ ఇచ్చారు. పెద్దిరెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మంత్రి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఎస్‌ఈసీ తేల్చిచెప్పింది.