అమరావతిః భారత రాజ్యాంగ నిర్మాణం తర్వాత భారత సామాజిక రాజకీయాలను కదిలించివేసిన ఘనత బి.పి. మండల్‌కే దక్కుతుందని, రాజకీయాల్లో ఉద్యోగ, విద్య, తదితర రంగాల్లో ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి మార్గం సుగమం చేసిన మహనీయుడు బిపి మండల్ అని సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మురళీ మోహన్ యాదవ్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం(అమరావతి)పార్టీ కార్యాలయంలో మండల్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు.
మండల్ కమిషన్ నివేదిక లేకుండా జాతీయ బీసీ కమిషన్‌లు గానీ, రాష్ట్రాల్లో బీసీ కమిషన్‌లు గానీ లేవని, దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న ఓబీసీలకు మేలు చేసిన మహనీయుడే బిందేశ్వరి ప్రసాద్ మండల్ (బి.పి. మండల్) అని స్పష్టం చేశారు. కేంద్రంలో విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈయన నేతృత్వంలోని మండల్ కమిషన్ ప్రతిపాదించిందని. దాన్ని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం దశాబ్దం తర్వాత అమల్లోకి తెచ్చిందని మురళీ మోహన్ యాదవ్ పేర్కొన్నారు.

బీహార్ రాష్ట్రానికి తొలి బీసీ ముఖ్యమంత్రిగా పనిశారని, కేవలం 48 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నా వత్తిళ్లకు లొంగకుండా తన పదవినే త్యాగం చేసిన ఘనత మండల్ కే దక్కుతుందన్నారు. . జిల్లా మెజిస్ర్టేట్‌గా, దేశ స్వాతంత్య్రం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీహార్ అసెంబ్లీకి, ఆ తర్వాత ఎంపీగా ఎన్నుకోబడ్డారని, శోషిత్ దళ్ పేరిట పీడిత ప్రజల పార్టీని ఏర్పాటు చేసి.. జయప్రకాశ్ నారాయణ పిలుపు మేరకు పదవుల్ని త్యాగం చేసి.. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల పక్షాన నిలిచిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. .
ఈకార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Dr.G.మురళి మోహన్ యాదవ్ గారు, ముఖ్యఅథిది అఖిల భారత యాదవ మహాసభ, రాష్ట్ర సెక్రటరీ జనరల్, శ్రీ, తులసి రామ్ యాదవ్ గారు, మంగళగిరి నియోజకవర్గం పార్టీ MLA అభ్యర్థి శ్రీ, శివరాం ప్రసాద్ యాదవ్ గారు, యువనాయకులు,కార్యకర్తలు,అభిమానులు,పాల్గొన్నారు.