తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ జాతి రత్నాలు ప్రచారం చేస్తున్నాయని టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు దందారాయుళ్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి ఆగడాలకు అంతే లేదన్నారు. వైసీపీ మంత్రుల బెదిరింపులకు తిరుపతి ప్రజలు భయపడొద్దని, నిజం బతకాలంటే ఓటర్లు టీడీపీకి పట్టం కట్టాలని పంచుమర్తి అనురాధ పిలుపు ఇచ్చారు.
