
దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. వామపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. బస్టాండ్ దగ్గర వామపక్షాలు, రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దుతో పాటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లాలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ధర్మవరంలో టీడీపీ, వామపక్షాలు, రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో బంద్‌కు మద్దతుగా 8 డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు బయటికిరాలేదు. మధ్యాహ్నం నుంచి బస్సులు తిరుగుతాయని అధికారులు ప్రకటన చేశారు. జల్లాలోని విద్యాసంస్థలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.