ముగ్గురు పిల్లల నిబంధనకు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం స్కిన్నెరపురంలో అధికారులు కొత్తభాష్యం చెప్పారు.

ఇక్కడ వైసీపీ మద్దతుతో అడ్డాల భాను లలిత మహాలక్ష్మి, టీడీపీ మద్దతుతో కునుపూడి నాగదుర్గ నామినేషన్లు వేశారు. అధికారులు మహాలక్ష్మి నామినేషన్‌ను అనుమతించి, నాగదుర్గ నామినేషన్ తిరస్కరించారు. దీనిపై ప్రశ్నిస్తే మహాలక్ష్మికి ముందు ఇద్దరు కవలలు, తరువాత ఒకరు జన్మించడంతో అనుమతించామని, నాగదుర్గకు ముందు ఒకరు.. తర్వాత ఇద్దరు కవలలు జన్మించడంతో తిరస్కరించామని చెప్పారు. అధికారుల వింత భాష్యానికి విస్తుపోయిన నాగదుర్గ ఎన్నికల సంఘం తనకు న్యాయం చేయాలని కోరారు.