విశాఖ ఉక్కు కర్మాగారాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం పోస్కో కంపెనీ కి ప్రయివేటీకరించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ కార్యక్రమమం
మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డా . ఏం ఎస్ ఎస్ భవన్ నుండి అంబెడ్కర్ విగ్రహం వరకు విశాఖ ఉక్కు ,ఆంధ్రుల హక్కు నినాదంతో నిరసన ర్యాలీ జరిగినది

పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగగా …
తొలుత అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పట్టణ ,మండల పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు ,తోట పార్ధ సారధి మరియు సీనియర్ నాయకులు ఎండీ ఇబ్రహీం ,వెలగపాటి విలియం లు …
తదనంతరం అంబేద్కర్ గారి విగ్రహమ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ,అమరావతి పట్ల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ నిరసన తెలియజేసారు.,
ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి మాట్లాడుతూ …
32 మంది ప్రాణ త్యాగాలఫలం విశాఖ ఉక్కు కర్మాగారం ,దాదాపు 40సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ,యువత ఉపాధి అవకాశాల కోసం ,ఆర్ధికంగా రాష్ట్రము ముందుకెళ్లాలని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆనాడు ఉద్యమాలలో వేలాది మంది విద్యార్థులు ,ఆంధ్రులు సాధించుకున్న కర్మాగారం
ఈరోజు విశాఖ ఉక్కు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది అంటూ ప్రయివేటీకరణకు నిర్ణయం తీసుకోవడం ,ఉక్కు కర్మాగారాన్ని అమ్మి వేయాలి అనే ఆలోచన రావడం దుర్మార్గం
కావాలని దుర్భుద్ధితో ప్రయిటీకరణకు మొగ్గు చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం తీరుని తెలుగు దేశం పార్టీ తరుఫున ఖండిస్తూ ,ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ పోరాడతామని తెలియజేస్తున్నాం
గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరరావు…మాట్లాడుతూ..
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ పేరుతో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రకు తెర లేపాయి …
ఈ కుట్ర లో ప్రధాన సూత్రధారి జగన్ మొహూన్ రెడ్డి ,వైసీపీ ప్రభుత్వం
ఆనాడు ప్రాణ త్యాగాలతో విశాఖ ఉక్కు కర్మాగారం సాధించుకుంటే ,ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తరువాత కుట్ర పన్ని ఏవిధంగా అయితే ఇసుక ,మద్యం ,భూముల అమ్మకం లలో జే టాక్స్ ద్వారా వేలకోట్లు సంపాయించి ,కాకినాడ పోర్టు ,రామాయపట్నం ఏ విడఁగా దోచుకుంటున్నారో అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని దోచుకోవడంకోసం పోస్కో కుట్రకు తెర లేపారు ..
దీనిలో ప్రధాన ముద్దాయిలు జగన్ మోహన్ రెడ్డి ,విజయ సాయి రెడ్డి లే …
టీడీపీ అధికారంలో ఉండగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంటె ఆనాటి ప్రధాని వాజపేయి గారిని ఒప్పించి 1000కోట్లు స్టీల్ ప్లాంట్ కు ఇప్పించిన ఘనత చంద్రబాబు గారిది
ఈ నాటి ముఖ్యమంత్రి ఒక కుట్ర తోటి పోస్కో కి అప్పజెప్పడానికి ముందుకెళుతూ ,కొన్ని లక్షల కుటుంబాలను రోడ్డు మీదకు లాగుతున్నారు
అసెంబ్లీ లో స్టీల్ ప్లాంట్ పై తీర్మానం చేయాలి,ముఖ్యమంత్రి ,ఎంపీ ,యమ్మెల్యే , లందరూ రాజీనామా చేసి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలి ,అందరినీ ఢిల్లీ తీసుకు వెళ్లి విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు నందం అబద్దయ్య ,గుంటూరు పార్లమెంట్ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి చావాలి ఉల్లయ్య ,మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి ,మాజి జడ్పీటీసీ ఆకుల జయసత్య పట్టణ టీడీపీ అధ్యక్షులు దామర్ల రాజు ,రురల్ మండల టీడీపీ అధ్యక్షులు తోట పార్ధసారధి ,మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ ,పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ ,పట్టణ తెలుగుయువత అధ్యక్షులు బోగి వినోద్ ,పట్టణ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి బుల్లా కోటి , ఎండీ ఇబ్రహీం , పొలుమాట్ల ప్రేమ్ కుమార్ , వాకా మంగారావు ,వెలగపాటి విలియం , పోట్లా బత్తుని లక్ష్మణరావు ,షేక్ హుస్సేన్ ,గాదె పిఛ్చిరెడ్డి , తిరువీధుల బాపనయ్య తదితరులు పాల్గొన్నారు