విశాఖ: మూడో రోజుకు చేరిన అఖిలపక్ష కార్మిక సంఘాల దీక్ష

0
345
Spread the love

 స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన దీక్ష ఆదివారం నాటికి మూడవ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ రెడ్డి వెంకటరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్ధలను నిర్వీర్యం చేసే నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ఏమాత్రం మంచిదికాదన్నారు. దేశభక్తులుగా చెప్పుకొంటున్న బీజేపీ ఆర్ధిక వ్యవస్ధను లూఠీ చేస్తోందని రెడ్డి వెంకటరావు విమర్శించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here