వైసీపీ ఎంపీలు గొర్రెల మంద!

0
355
Spread the love

వైసీపీకి. లోకసభలో 21 మంది, రాజ్యసభలో ఆరుగురు ఎంపీలు ఉండి ఏం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో ఆదివారం సాయంత్రం జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో వైసీపీ ఎంపీలు గొర్రెలమందగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘‘తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌, విమానాశ్రయ విస్తరణ, స్మార్ట్‌సిటీ గురించి ఏనాడైనా మాట్లాడారా? ఒక్క రూపాయి తెచ్చారా?’’ అని ప్రశ్నించారు. పార్లమెంటులో టీడీపీకి ముగ్గురే ఎంపీలున్నా సింహాల్లా గర్జిస్తున్నారని, సమస్యలపై పోరాడుతున్నారన్నారు. ప్రత్యేకహోదా, విశాఖ ఉక్కు, పోలవరం, విశాఖ రైల్వేజోన్‌ తదితర అన్ని అంశాలపైనా కేంద్రాన్ని నిలదీసేది ఒక్క టీడీపీ ఎంపీలేనన్నారు. ‘‘కేంద్రం ఏం చెబితే ఆ మేరకు తలాడించే గొర్రెలమందలో ఇంకో గొర్రె చేరితే లాభం ఏమైనా ఉంటుందా? పార్లమెంటులో ప్రశ్నించే గొంతుకావాలి కానీ. మోదీని చూసి ప్యాంటు తడుపుకునే బ్యాచ్‌ అవసరమా? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పనబాక లక్ష్మిని టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాం. ఒక మహిళగా ఇంట్లో ఆడవాళ్లు పడేకష్టం, ఎంపీగా ప్రజల సమస్యలు పరిష్కరించడం ఆమెకు తెలుసు. పార్లమెంటులో గర్జించి ప్రజలకు సేవచేసే మీ ఇంటి లక్ష్మి కావాలో.. పార్లమెంటులో పడుకుని జగన్‌రెడ్డికి పాదసేవ చేసే ఎంపీ కావాలో మీరే తెల్చుకోండి’’ అని లోకేశ్‌ స్పష్టం చేశారు. 

ఇది.. జేసీబీ ప్రభుత్వం!

‘‘జగన్‌ ప్రభుత్వానికి నేను జేసీబీ అని పేరుపెట్టా. జే అంటే జగన్‌ ట్యాక్స్‌, సీ అంటే కరప్షన్‌, బీ అంటే బాదుడే బాదుడు’’ అని లోకేశ్‌ దుయ్యబట్టారు. జగన్‌ బాదుడుకు ప్రజలు పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ‘‘జగన్‌రెడ్డి పేరును సైకోరెడ్డిగా మార్చా. ఆయనకు దళితులంటే కోపం. ఇటీవలి వరకు తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్‌కు కనీసం అపాయింట్‌మెంటు కూడా ఇవ్వకుండా వేధించారు. దళితులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆయన మీడియా ముఖంగా బాధను వ్యక్తం చేశారు. దళిత ఎంపీ చనిపోతే కనీసం నివాళులర్పించడానికి వెళ్లని సైకోరెడ్డి.. ఆయన సామాజికవర్గం ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి చనిపోతే స్పెషల్‌ ఫైట్‌లో వాలిపోయారు. దళితనేత, బద్వేలు ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య చనిపోతే అక్కడికి వెళ్లి మృతదేహం పక్కన నిలబడి జగన్‌ నవ్వుతున్నారు. దళితుడైన డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీఎం పక్కన నిలబడాలి. మంత్రి పెద్దిరెడ్డి మాత్రం దర్జాగా కుర్చుంటారు. చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకు దళిత మేజిస్ట్రేట్‌ రామకృష్ణను వెంటాడి వేధిస్తున్నారు’’ అటూ లోకేశ్‌ నిప్పులు చెరిగారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here