స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తి

0
181
Spread the love

పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. స్పిల్ వే 52 పిల్లర్లు, 52 మీటర్లు నిర్మాణం పూర్తి కాగా, స్పిల్ వే నిర్మాణం చేపట్టాలంటే 52 మీటర్ల ఎత్తున పిల్లర్లు నిర్మించాల్సి ఉంటుంది. స్పిల్ వే లో రెండవ బ్లాక్ లో ఫిష్ లాడర్ నిర్మాణం చేపట్టడం వల్ల.. దీని డిజైన్లకు సంబంధించి అనుమతులు ఆలస్యం కావడంతో 2వ పిల్లర్ నిర్మాణం ఆలస్యమయ్యింది. ఇటీవలే డిజైన్లు అన్నీ అనుమతులు వచ్చాక త్వరిత గతిన నిర్మాణం పూర్తి చేసి స్లాబ్ లెవల్‌కు(సరాసరిన 52 మీటర్ల ఎత్తు) అన్ని పిల్లర్ల నిర్మాణం మేఘా సంస్థ పూర్తి చేసింది. పోలవరం పనులు చేపట్టి 2019 నవంబర్ 21న కాంక్రీట్ పనులు మొదలు పెట్టింది.

Construction Of Polavaram Project Spillway Pillars Completed

స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ పొడవు 1128 మీటర్లకు గానూ ఇప్పటికే 1095 మీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. స్పిల్ వే పిల్లర్లపై పెట్టాల్సిన గడ్డర్లు 192 కాగా ఇప్పటికే 188 గడ్డర్లు పిల్లర్లపై ఏర్పాటు చేశారు. 4 గడ్డర్లు మాత్రమే పిల్లర్లపై పెట్టాల్సి ఉంది. 2019 నవంబర్ లో స్పిల్ వే పిల్లర్లు కాంక్రీట్ నిర్మాణం మేఘా ఇంజనీరింగ్ ప్రారంభించింది.

జులై 2020 లో స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్లు ఏర్పాటును ఎంఈఐఎల్ ప్రారంభించింది. స్పిల్ వే బ్రిడ్జ్ స్లాబ్ కాంక్రీట్ సెప్టెంబర్, 9 2020లో మొదలు కాగా, అనతి కాలంలోనే స్పిల్ వే పనులను పూర్తి చేసింది. ఇప్పటికే స్పిల్ వే బ్రిడ్జ్‌లో పూర్తయిన స్లాబ్ సంఖ్య 45, మిగిలిన 3 స్లాబ్‌లు పనులు త్వరలోనే పూర్తవుతాయి. మొత్తం 49 ట్రూనియన్ భీమ్‌లు పనులు పూర్తి చేయడంతో పాటు స్పిల్ వే బ్రిడ్జి లో మొత్తం 48 గేట్లకు గాను ఇప్పటికే 28 గేట్లను ఏర్పాటు చేసింది. త్వరలోనే గేట్లకు సిలిండర్లు, పవర్ ప్యాక్ లు అమర్చేందుకు ప్లాట్ ఫాం ఏర్పాట్ల పనులు చకచకా జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here