2022 ఏప్రిల్‌ నాటికి పోలవరం పూర్తి

0
183
Spread the love

పోలవరం ప్రాజెక్టు పనులు 2022 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర జలశక్తి సహాయమంత్రి రతన్‌లాల్‌ కటారియా వెల్లడించారు. 2020 నవంబరులో జరిగిన 13వ పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి లోబడి ప్రాజెక్టు పూర్తి చేసే వ్యవధి లక్ష్యాన్ని సవరించినట్లు రాజ్యసభలో సోమవారం టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు. తొలుత ప్రాజెక్టును 2021 డిసెంబరులో పూర్తి చేయాలని భావించినట్లు గుర్తు చేశారు.

ప్రస్తుతం స్పిల్‌వే పనులను 2021మే నాటికి, రేడియల్‌ గేట్ల బిగింపు పనులను ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి, కాఫర్‌ డామ్‌ పనులను వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కటారియా తెలిపారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డామ్‌ గేప్‌-2 పనులు, కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులతోపాటు.. భూ సేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపు ప్రక్రియను 2022 ఏప్రిల్‌ నాటికి నాటికి పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here