‘ఆచార్య’ మీద రూమర్స్..నిజం చేసిన మెగాస్టార్..?

0
146
Spread the love

కొన్ని సందర్భాలలో కొన్ని టాప్ సీక్రెట్స్ అలా బయటకి రీవీలవుతుంటాయి. ఎంత గోప్యంగా ఉంచాలనుకున్నప్పటికీ ఎవరో ఒకరు కుండ బద్దలు కొట్టేస్తారు. ముఖ్యంగా ఇలాంటి విషయాలు సినిమా వేడుకలు జరుగుతున్నప్పుడు బయటకి వచ్చేస్తుంటాయి. మైక్ పట్టుకొని అభిమానుల ముందు మాట్లాడుతుంటే తన్మయత్వంలోనో..ఆవేశంలోనో ఎప్పుడో చెప్పాల్సిన విషయాలు ఇప్పుడే లీక్ చేసేస్తుంటారు. ఈ మధ్య మెగాస్టార్ ఇలా కొన్ని సీక్రెట్స్‌ని ఫ్లోలో రివీల్ చేసేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 152వ సినిమాగా ఆచార్య తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 80 శాతం పూర్తయిందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ – మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో చిరంజీవికి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రాం చరణ్ కీలక పాత్రలో కనిపించబోతుండగా ఆయనకి జంటగా పూజా హెగ్డే నటిస్తోందట. ఇక ఈ సినిమా మే 13న దేశ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌ని ఫ్లోలో మెగాస్టార్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆచార్య సినిమాలో ఒక ముఖ్య పాత్ర సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ చరణ్ ఆ పాత్రని చేయబోతున్నట్టు మెగాస్టార్ పొరపాటున చెప్పేశాడు. తాజాగా ఆచార్య సినిమాకి సంబంధించిన మరొక కీలకమైన విషయాన్ని బయట పెట్టేశాడు. ఆచార్య సినిమా దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ కథలో నక్సల్స్ నేపథ్యం కూడా ఉంటుందని ప్రచారం జరుగుతూ పలు రకాల రూమర్స్ వస్తున్నాయి. కానీ దర్శకుడు.. మిగతా యూనిట్ సభ్యులు గానీ ఈ విషయాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. అయితే తాజాగా రానా దగ్గుబాటి నటించిన విరాట పర్వం సినిమా టీజర్‌ను మెగాస్టార్ రిలీజ్ చేశారు. ఆసమయంలోనే విరాట పర్వం టీజర్ చూస్తుంటే నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కిందనిపిస్తోంది. మా ఆచార్య సినిమా కూడా నక్సల్స్ బ్యాక్‌డ్రాప్ అనేశాడు. దీంతో ఇన్నాళ్ళు రూమర్స్ అనుకున్న విషయాన్ని మెగాస్టార్ రివీల్ చేసి నిజం చేశాడని చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here