టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్స్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘ఆచార్య’ ఒకటి. సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మరోసారి మెగాస్టార్ సరసన నటిస్తోంది. రీసెంట్‌గా ఈ చిత్ర టీజర్‌ని చిత్రయూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ సంచలనాలను క్రియేట్ చేయడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎలాగైనా ఈ చిత్రాన్ని మే 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ తీవ్రంగా కృషి చేస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ చిత్ర షూటింగ్‌లోకి జాయిన్ అయ్యారు. చిరు, చరణ్ కలయికలో జరుగుతున్న ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని మారేడిమిల్లి ఫారెస్ట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రీకరణలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొంటున్నట్లుగా ఇప్పుడొక వీడియో, కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో చిరంజీవి, చరణ్‌లను చూసిన వారంతా మెగా ట్రీట్ మాములుగా ఉండదని అనుకుంటుండటం విశేషం. ఈ వీడియో, ఫొటోలకు సోషల్ మీడియాలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.