మూతపడిన జెట్ ఎయిర్‌వే్‌సను మళ్లీ పునరుద్ధరించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఎన్‌సీఎల్‌టీ ఆమోదమే తరువాయి అని ఈ బిడ్‌లో నెగ్గిన నెగ్గిన జలాన్ కార్లోక్ కన్సార్షియం తెలిపింది. ఎన్‌సీఎల్‌టీ ఆమోదం లభించిన నాలుగు నుంచి ఆరు నెలల్లో జెట్ ఎయిర్‌వేస్ విమానాలు గాల్లోకి ఎగురుతాయని ఈ కన్సార్షియం ప్రధాన భాగస్వామి మురారి లాలా జలాన్ చెప్పారు. జెట్ ఎయిర్‌వేస్ పురుద్ధరణ కోసం జలాన్ కార్లొక్ సమర్పించిన ప్రణాళికకు ఎస్‌బీఐ నాయకత్వంలోని రుణదాతల కమిటీ (సీఓసీ) ఇప్పటికే ఆమోదం తెలిపింది. ముందుగా 25 విమానాలతో సేవలు ప్రారంభిస్తామని జలాన్ వెల్లడించింది.
