‘ఆర్‌ఆర్‌ఆర్’‌: కీలక ఫొటోస్‌ లీక్‌.. తలపట్టుకుంటోన్న టీమ్‌

0
376
Spread the love

ఇప్పటి వరకు సినీ పరిశ్రమని పైరసీ బెడద ఇబ్బంది పెడితే.. కొత్తగా ఇప్పడు లీక్‌ల గొడవ మరింత ఇబ్బందిని కలిగిస్తోంది. ఎన్నో కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు.. ఈ లీక్‌లతో తలలు పట్టుకుంటున్నారు. సినిమాలకు సినిమాలనే లీక్‌ చేయడం ఈ మధ్య ఫ్యాషన్‌ అయిపోయింది. సెట్‌ పిక్‌ లీక్‌ అయితే.. సినిమాలో విషయం తెలిసిపోతుందని ఎంత జాగ్రత్తగా దర్శకనిర్మాతలు సినిమా చిత్రీకరణలు ప్లాన్‌ చేసినా.. ఏదో ఒక రూపంలో ఫొటోలు లీక్‌ అవుతూనే ఉన్నాయి. ఆ సినిమా, ఈ సినిమా అని కాకుండా ప్రతీ సినిమా ఈ లీక్‌ సమస్యను ఫేస్‌ చేస్తోంది.

తాజాగా టాలీవుడ్‌ స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పిన ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు సంబంధించి కొన్ని కీలక ఫొటోలు లీక్‌ అయ్యాయి. అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న రామ్‌ చరణ్‌ పిక్‌, కొమురం భీమ్‌ పాత్ర చేస్తోన్న ఎన్టీఆర్‌ పిక్‌తో పాటు మరికొన్ని ఫొటోలు కూడా లీక్‌ అయ్యాయి. మరీ ముఖ్యంగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి ఈ చిత్రంలో పులితో ఫైట్‌ ఉంటుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఫైట్‌కి సంబంధించిన కీలకమైన ఫొటో కూడా లీక్‌ కావడం ఇప్పుడు చిత్రయూనిట్‌ని కలవరపెడుతోంది.

భీమ్‌ ఇంట్రో టీజర్‌లో తలపై రక్తం పోసుకునే సన్నివేశాన్ని చూపించారు. పులిని రప్పించడం కోసం ఎన్టీఆర్‌ అలా రక్తం మీద పోసుకుంటాడని, ఆ తర్వాత పులి వచ్చాక దానిని మట్టుపెడతాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా లీకైన స్టిల్‌ ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేస్తుంది. ఏదీఏమైనా.. ఈ లీక్స్‌పై చిత్ర దర్శకనిర్మాతలు దృష్టిపెట్టకపోతే.. సినిమాకు మరింత డ్యామేజ్‌ అయ్యే అవకాశం లేకపోలేదు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ కి సంబంధించిన ఈ లీక్స్‌పై చిత్ర దర్శకనిర్మాతలు సీరియస్‌గా ఉన్నారని, ఎలా ఈ పిక్స్‌ బయటికి వెళ్లాయనేది ఆరా తీసి.. వారిని కఠినంగా శిక్షించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here