ఇంజినీరింగ్‌ స్కిల్స్‌ @ఈఎస్‌సీఐ

0
269
Spread the love

సమాజంలో ఇంజినీర్ల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాగు, సాగునీరు, ఆహారం, విద్య, రోడ్లు, ప్రాజెక్టులు ఇలా ప్రతిదానిలో వీరి పాత్ర చాలా కీలకం. కేవలం నాలుగేండ్లు చదవగానే ఇంజినీరింగ్‌ పూర్తికాదు. ఎప్పటికప్పుడు దీనిలో అప్‌డేట్స్‌తోపాటు సమర్థవంతమైన మేనేజ్‌మెంట్‌ చేసినప్పుడే దీని పాత్ర పూర్తవుతుంది. దీనికోసం ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌, ట్రెయినింగ్‌, రిసెర్చ్‌ కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా. ఇది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఇండియా) పరిధిలోని అటానమస్‌ ఆర్గనైజేషన్‌. ఈ సంస్థ గురించి సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం…

ఇంజినీరింగ్‌ స్కిల్స్‌ @ఈఎస్‌సీఐ

ఈఎస్‌సీఐ
ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియాను 1981లో ప్రారంభించారు. దీన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఇండియా) స్థాపించింది. దేశంలో అతిపెద్ద ప్రొఫెషనల్స్‌ కలిగిన సంస్థ. ఆసియా ఖండంలో ఇలాంటి సంస్థ మరొకటి లేదు. ఇంజినీర్లకు శిక్షణ, పరిశోధన కోసం దీన్ని ఏర్పాటు చేశారు. స్కిల్స్‌ను నేర్చుకోవడానికి, కొత్తగా వచ్చే సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఈ సంస్థ శిక్షణ అందిస్తుంది.

ఈ సంస్థలో 9 డివిజన్లు ఉన్నాయి. సివిల్‌/ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగ్‌, ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఐటీ, మేనేజ్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ, పవర్‌ అండ్‌ ఎనర్జీ, క్వాలిటీ అండ్‌ ప్రొడక్టివిటీ, వాటర్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ డిజైన్‌ ప్రోటోటైపింగ్‌ సెంటర్‌, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌. ఇవేకాకుండా ప్రభుత్వ సంస్థలకు, శాఖలకు, ఇండస్ట్రీకి కన్సల్టెన్సీ సంస్థగా ఇది పనిచేస్తుంది.

ఈ సంస్థ ఏటా పలు రకాల ఓరియంటేషన్‌, పలు రకాల సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తుంది.

ఇంజినీరింగ్‌కు సంబంధించి నిరంతరం జరుగుతున్న మార్పులపై ప్రొఫెషనల్స్‌కు ఇక్కడ శిక్షణ ఇస్తారు.

స్కూల్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌
ఈ విభాగాన్ని 2008లో ప్రారంభించారు. దీనికి ఏఐసీటీఈ అనుమతి ఉంది.

ఈ సంస్థ రెండేండ్ల ఫుల్‌టైం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తుంది.

ప్రోగ్రామ్స్‌: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం)- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌, జనరల్‌.

పీజీడీఎం- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: సివిల్‌, టెలీకమ్యూనికేషన్‌, పవర్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌.

పీజీడీఎం- జనరల్‌: మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌ఎం, ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌

అర్హతలు: పీజీడీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోర్సుకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. పీజీడీఎం- జనరల్‌కు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

క్యాట్‌, మ్యాట్‌, ఏటీఎంఏ, సీమ్యాట్‌, ఐసెట్‌ తదితర జాతీయ, రాష్ట్రస్థాయి మేనేజ్‌మెంట్‌ పరీక్షల్లో వ్యాలిడ్‌ స్కోర్‌ వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తారు.

ఎంపిక విధానం

గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారాకోర్సు ఫీజు: రెండేండ్లకు రూ.3,30,000/-, ఇక్కడ చదువుకునే విద్యార్థులకు మెరిట్‌ స్కాలర్‌షిప్స్‌ ఇస్తారు.

ప్లేస్‌మెంట్స్‌

ఇక్కడ చదివిన మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు 90 శాతం పైగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ లభిస్తున్నాయి. వీరిలో ఎక్కువమంది గూగుల్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌, ఐబీఎం, టాటా, హెచ్‌పీ, ఫేస్‌బుక్‌, సైయెంట్‌, యాక్సెంచర్‌ తదితర కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు.

వెబ్‌సైట్‌: http://www.escihyd.org

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here