నారా లోకేష్ గారు పంపిన తక్షణ ఆర్ధిక సహాయాన్ని భాదితకుటుంబాలకు అందజేసిన ఈమని గ్రామ సర్పంచ్ సిద్దెల శ్రీవాణి ఉజ్వల హరిణి, టీడీపీ నాయకులు..
దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి ధరణికోట శ్రీనివాసరరావు, ధరణికోట అమరయ్య ల ఇళ్ళు పూర్తిగా కాలిపోగా…
విషయం తెలుసుకున్న జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు వెంటనే స్పందించి తక్షణ సాయం గా ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున 20,000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని గ్రామ సర్పంచ్ సిద్దెల శ్రీవాణి ఉజ్వల హరిణి గారిచే అందజేయించారు..

బాధిత కుటుంబాలను పరామర్శించి, ఆర్ధిక సహాయం అందజేసిన ఈ కార్యక్రమం లో గ్రామ టీడీపీ నాయకులు కాసరనేని శివరామకృష్ణ, అంచె రవిచంద్, మన్నం అశోక్, నక్కబోయిన వేణుబాబు, రాంబాబు, కోటిపల్లి ప్రసాద్, శిఖనం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.