ఉదయనిధికి దక్కని సీటు

0
180
Spread the love

డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ తనయుడు, ఆ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయనిధికి తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. అయితే, రాష్ట్రమంతటా పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయాలని పార్టీ అధిష్ఠానం ఆయనను ఆదేశించింది. చెన్నై నగర పరిధిలోని థౌజెండ్‌లైట్స్‌ లేదా చేపాక్‌-ట్రిప్లికేన్‌ నియోజకవర్గాల నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉదయనిధి భావించారు. ఆ మేరకు దరఖాస్తు చేయగా, శనివారం ఆయనను స్టాలిన్‌, డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ ఇంటర్వ్యూ కూడా చేశారు. కాగా, పార్టీ యువజన విభాగం నేతగా రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉదయనిధిపై ఉందని, ఆయనే స్వయంగా పోటీ చేస్తే, అన్ని చోట్లా ప్రచారం చేయలేరని స్టాలిన్‌, దురైమురుగన్‌   అభిప్రాయపడినట్టు సమాచారం. వారి సూచన మేరకు ఉదయనిధి పోటీ నుంచి విరమించుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగిస్తూ డీఎంకే కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here