ఉపాధి బిల్లులు చెల్లించాల్సిందే!

0
368
Spread the love

ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కింద 2018-19నాటి బి ల్లులను ఇప్పటికీ చెల్లించకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులే నిర్వహించకపోతే కూలీలకు సొమ్ము ఎలా చెల్లించారని నిలదీసింది. పా త బిల్లులు చెల్లించకుండా ఆ తర్వాత చేసిన పనులకు ఎలా చెల్లింపులు చేస్తారని ప్రశ్నించింది. కేంద్రం నుం చి నిధులు రాకపోతే 2019-20 బిల్లులు ఎలా చెల్లించారని నిలదీసింది. రూ.5 లక్షలలోపు విలువ చేసే పను ల్లో 20ు సొమ్మును మినహాయించి చెల్లిస్తామని కోర్టు కు హామీ ఇచ్చి.. ఇప్పటివరకు ఎందుకు చెల్లించలేదని మండిపడింది. ఇదే వైఖరి ప్రదర్శిస్తే ఉన్నతాధికారుల ను కోర్టుకు పిలవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కోర్టుకు ఇచ్చిన హామీ మేరకు తదుపరి విచారణ నాటి కి బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది.

చెల్లింపు వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్‌ 23కి వాయిదా వేసింది. ఈ మేరకు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాస నం మంగళవారం ఆదేశాలిచ్చింది. ఉపాధి హామీ పథ కం కింద 2019 జూన్‌ 1లోపు నిర్వహించిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు వచ్చాయి.

7 లక్షల పనులకు బిల్లులివ్వలేదు..

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్‌, పి.వీరారెడ్డి, న్యాయవాదులు ప్రణతి, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. ఉపాధి హామీ పధకం కింద కేంద్ర నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదన్నా రు. 2018-19 సంవత్సరానికి గాను 7 లక్షల పైచిలుకు పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. విజిలెన్స్‌ ఎంక్వైరీ పేరుతో గత ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించ డం లేదని తెలిపారు. ‘నిబంధనల ప్రకారం 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పాత ప్రభుత్వంలో చేసిన ఈ పనులకు బిల్లులు నిలిపివేశారు. చేసిన పనులకు అధికారులు కొలతలు తీసి.. బిల్లులు కూడా సిద్ధం చేశారు. ఇలాంటి దశలో డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వం నిలిపివేసింది. పాత బిల్లులు చెల్లించకుండా 2019 తర్వాత వచ్చిన బిల్లులు చెల్లిస్తున్నారు. రూ.5లక్షలలోపు విలువ చేసే పనులకు 20ు సొమ్మును మినహాయించి నిధులు చెల్లిస్తామని కోర్టుకు ఇచ్చిన హామీని అమలు చేయలేదు. ఉపాధి పనులు నేరుగా పంచాయితీలే నిర్వహిస్తాయి.

విడుదలయ్యే నిధులు స్థానిక సంస్థలకే చెం దుతాయి. అవి కాంట్రాక్టర్లకు వెళ్తాయని ప్రభుత్వ న్యా యవాది చేస్తున్న వాదనలో నిజం లేదు’ అని స్పష్టం చేశారు. మొత్తం 7.94 లక్షల పనులు జరుగగా.. వాటి లో 11 వేల పనులను నమూనాగా తీసుకుని విజిలెన్స్‌ విభాగం విచారణ జరిపిందని ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ తెలిపారు. కొన్ని చోట్ల అవకతవకలు జరిగినట్లు తేలిందని చెప్పారు. రూ.5 లక్షల లోపు విలువచేసే 7.27 లక్షల పనులకు 20 శాతం సొమ్ము మినహాయించి చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, రూ.409 కోట్లు విడుదల చేయనుందని తెలిపారు. రూ.5లక్షలకు పైబడి విలువ చేసే 62 వేల పనులకు ఎంత మినహాయించాలో ఇంకా నిర్ణయించలేదన్నారు.

కూలీలకు చెల్లించాల్సిన నిధులు చెల్లించామని.. మెటీరియల్‌ కాంపోనెంట్‌ చెల్లించాల్సి ఉందన్నారు. కేంద్రం నుంచి నిధులు రావలసి ఉందన్నారు. చెల్లించాల్సిన నిధులు కాంట్రాక్టర్లకు చెందుతాయని.. పంచాయతీలకు కాదని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు రాకపోతే 2019-20 బిల్లులు ఎలా చెల్లించారని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టుకిచ్చిన హామీ మేరకు తదుపరి విచారణ జరిగే ఏప్రిల్‌ 23నాటికి సదరు బిల్లులు చెల్లించాల్సిందేనని స్పష్టంచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here