దాదాపు 40 రోజులు పైట్ చేసీ చేసీ అలసిపోయాడు మాస్ మహరాజ్ రవితేజ. ఖిలాడి చిత్రానికి సినిమా ప్రారంభం నుంచి సుమారుగా ఎక్కువ యాక్షన్ పార్ట్ షూటింగ్ మాత్రమే జరిగింది. సౌత్ ఇండియాలో టాప్ ర్యాంక్‌లో ఉన్న ఫైట్ మాస్టర్స్….రామ్ లక్ష్మణ్, కెజిఎఫ్ ఫేమ్ అన్బు-అరివు, వెంకట్ మాస్టర్ యాక్షన్ పార్ట్‌ని డైరెక్ట్ చేశారు. మొత్తం కలిపి ఏడు ఫైట్లు ఉన్నాయంటే ఖిలాడి సినిమాలో ఎంత యాక్షన్ ఓరియంటేషన్ ఉంటుందో, ఉందో ఊహించడం పెద్ద కష్టం కాదు.

అయితే ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ మార్చి 10 వరకూ ఇండియాలో జరిగి పూర్తవుతుంది. తర్వాత మార్చి 15 నుంచి యూరోపియన్ కంట్రీస్…ఇటలీ, స్పెయిన్‌లో 5 సాంగ్స్ అండ్ వన్ ఛేజ్ సీన్ చేయబోతున్నారు. క్రాక్ తర్వాత వెంటనే వస్తున్న సినిమా కావడంతో ఖిలాడీ పై అంచనాలు అధికంగా నెలకొన్నాయి. క్రాక్ ఇచ్చిన ఉత్సాహం, ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఆ మధ్యంతా రవితేజ కొంచెం డౌన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ పుణ్యమా అని గ్యాప్ తీసుకున్న రవితేజ ఇప్పుడింక రెట్టించిన ఉత్సాహంతో.. షూటింగ్‌లో రెచ్చిపోయి మరీ చేశాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, సాంగ్స్ కరెక్టుగా సెట్ అయితే రవితేజ సినిమాకి తిరుగులేదన్నది రికార్డులు చెబుతున్నాయి. ఫార్ములా ప్రకారం ఇద్దరు హీరోయిన్లు.. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి.. రొమాన్స్‌కి లోటుండదు. రాక్షసుడు చిత్రంతో ఓ మంచి హిట్‌ని సొంతం చేసుకున్న రమేష్ వర్మ మళ్ళీ ఖిలాడి సినిమాతో మరో ఛాలెంజ్‌ని తీసుకున్నాడు. ఖిలాడి మే 28 విడుదల కానుంది.