ఎక్స్‌క్లూజివ్: అనుష్కలా డేర్ చేస్తోన్న ప్రణీత

0
196
Spread the love

ఒక నటుడు లేదా నటి సంపూర్ణ నటుడు లేదా నటి అనిపించుకోవాలంటే.. ఎప్పుడూ స్టార్‌డమ్ ఉన్న పాత్రలే కాదు.., వైవిధ్యమైన పాత్రలు కూడా చేయాలి. చేసి మెప్పించాలి. అలా మెప్పించినప్పుడే వారు పరిపూర్ణ నటులుగా పరిగణింపబడతారు. ముఖ్యంగా హీరోయిన్లకు నటనపరంగా హీరోలకు ఉండేంత స్కోప్ చాలా రేర్‌గా దొరుకుతుంటుంది. రొటీన్‌గా రొమాన్స్‌కు తప్ప ఇప్పుడున్న హీరోయిన్లకు నటించడానికి ఏమీ ఉండటం లేదు. అదే పాత తరంకి వెళితే అంజలి, సావిత్రి, జమున, శారద వంటి వారు మహానటీమణులుగా గుర్తింపును పొందారు. వారి తర్వాత తరంలో కూడా విజయశాంతి, జయసుధ, జయప్రద, రాధ, సుహాసిని, రాధిక, రమ్యకృష్ణ వంటి వారు కూడా వైవిధ్యమైన పాత్రలు చేసి మెప్పించారు. ప్రజంట్ అయితే అనుష్క, నయనతార, సమంత మినహా ఏ ఒక్కరి పేరు నటనపరంగా వినిపించదు. లేడీ ఓరియంటెడ్ చిత్రమంటే చాలు గుర్తొచ్చేది వీరి పేర్లే.

వీరిలో ముఖ్యంగా అనుష్క వైవిధ్యమైన పాత్రలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఏ తరహా పాత్ర అయినా చేయగలదు అనిపించుకుంది. అయితే ‘సైజ్ జీరో’ చిత్రంలో పాత్ర కోసం ఆమె తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఇప్పుడు సేమ్ టు సేమ్ అనుష్క దారిలోనే నడుస్తోంది బాపుగారి బొమ్మ ప్రణీత. వాస్తవానికి ప్రణీతకు టాలెంట్ ఉన్నా.. లక్ మాత్రం కలిసిరాలేదు. అందుకే ఇంకా ఆమె సరైన స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయింది. కానీ ఇప్పుడు మాత్రం వచ్చిన ఛాన్స్‌ని వదులుకోకూడదని ఫిక్సయింది. అందుకే ‘సైజ్ జీరో’ చిత్రంలో అనుష్కలా లావుగా కనిపించేందుకు డేర్ చేస్తోంది. ఇంతకీ ప్రణీత.. లావుగా కనిపించేది ఏ చిత్రం అనుకుంటున్నారు కదా!. ఆమె అనుష్కలా లావుగా కనిపించబోయే చిత్ర వివరాలను చిత్రజ్యోతి ఎక్స్‌క్లూజివ్‌గా రివీల్ చేస్తోంది.

ప్రణీత ప్రస్తుతం బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ చిత్రంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రణీత రెండు పాత్రలలో కనిపించనుంది. అందులో ఒకటి సన్నగా ఉండే పాత్ర కాగా, రెండోది ‘సైజ్ జీరో’ చిత్రంలో అనుష్క తరహా పాత్ర. ప్రస్తుతం సన్నగా ఉండే పాత్రకి సంబంధించిన షూట్‌ని పూర్తి చేసిన ప్రణీత.. లావుగా కనిపించే పాత్ర కోసం బరువు పెరిగే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ పాత్రకు సంబంధించిన చిత్రీకరణను మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రంలో చేసే రెండు పాత్రలూ.. చాలా వైవిధ్యంగా ఉంటాయని, తప్పకుండా తనకు మంచి పేరు తీసుకువస్తాయని ప్రణీత నమ్ముతోంది. మరి ఆమె నమ్మకం ఎంత వరకు నిజమవుతుందో తెలియాలంటే.. సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here