వాళ్లంతా కొవిడ్ వారియర్స్. కరోనా కష్టకాలంలో విశేష సేవలందించారు. విధుల నుంచి తొలగించడంతో రోడ్డునపడ్డారు. ముఖ్యమంత్రి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఆలయానికి వస్తున్నారని తెలిసి.. ఆయనక తమ గోడు చెప్పుకుందామని పెద్దసంఖ్యలో అక్కడికి వచ్చారు. కానీ.. పోలీసులు వారిని లోనికి అనుమతించకపోవడంతో బయటి నుంచే నినాదాలు చేశారు. సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరం రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభా్‌షచంద్రబో్‌సను కలిసి తమ సమస్యను వివరించారు. అనంతరం అక్కడే ఉన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కాళ్లమీద పడి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్నారు. వారి సమస్యలను సీఎంకు వివరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
