రూట్ ద్విశతకమేమో కానీ..

ఐదేళ్లనాటి వివాదం మరోసారి రాజుకుంది. 2016 టీ20 వరల్డ్‌కప్ సెమీ్‌సలో మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ (51 బంతుల్లో 81 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్.. బిగ్ ‘బి’ అమితాబ్ బచ్చన్ మధ్య ట్విటర్ వార్ జరిగింది. ‘ఇలాగే ఆడితే రూట్‌ను విరాట్ ఏదో ఒక రోజుకి అందుకొంటాడు’ అని అప్పట్లో ఫ్లింటాఫ్ ట్వీట్ చేశాడు. దీనికి ‘ఎవరా రూట్? వేళ్లతో సహా పీకేస్తాం’ అని బచ్చన్ కౌంటర్ ఇచ్చాడు. అవకాశం కోసం కాచుక్కూర్చున్న ఫ్లింటాఫ్..రూట్ తాజా ప్రదర్శనతో ఇదే అదనుగా రంగంలోకి దూకాడు. అమితాబ్ నాటి రిప్లైను ఉదహరిస్తూ.. ‘పెద్దాయనకు గౌరవంగా’ అంటూ పాత ట్వీట్‌ను తిరగదోడాడు.