రేషన్ బియ్యాన్ని 98 శాతం మంది లబ్ధిదారులకు ‘ఐరిస్’ (కనుపాపల స్కానింగ్) పద్ధతిలోనే ఇస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రేషన్‌కార్డుదారులందరికీ ఓటీపీ అవసరంలేదని, ఐరిస్ పనిచేయని వారికి మాత్రమే మొబైల్ ఓటీపీతో బియ్యంపంపిణీ చేస్తామని, ఇలాంటి వారి సంఖ్య కేవలం 2ు మాత్రమే ఉంటుందని న్నారు.

నాలుగు రోజులుగా రేషన్ పంపిణీలో ఇబ్బందులు తలెత్తటం, రేషన్ డీలర్లు కేవలం ఓటీపీ ద్వారానే బియ్యం పంపిణీ చేస్తామని చెప్పటం, వినియోగదారులు సెల్‌ఫోన్ నెంబర్ సీడింగ్ కోసం ఆధార్ సెంటర్ల వద్దకు పరుగులు పెట్టిన నేపథ్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థ గాడితప్పింది. ఈ తరుణంలో పీడీఎ్‌సపై సమీక్ష నిర్వహించిన మంత్రి గంగుల… గురువారం కలెక్టర్లు, తహసీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు. రేషన్‌కార్డులో ఉన్న కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు చౌకడిపో వద్దకు వెళ్లి ఐరి్‌సను ధ్రువీకరించుకొని బియ్యం తీసుకోవచ్చని సూచించారు.
ఒకవేళ డీలర్లు ఐరిస్ ద్వారా బియ్యం ఇచ్చేందుకు నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విధానంలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఓటీపీ విధానానికి వెళ్లాలని సూచించారు. ఐరి్‌సకు 95శాతం ప్రామాణికత ఉన్నదని, ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన బియ్యం పంపిణీలో 60శాతం ఇదే పద్ధతిలోనే జరిగిందని మంత్రి తెలిపారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా… ఈ నెలలో రేషన్ పంపిణీ గడువును మరో వారం అదనంగా పొడిగించామని, 22 వరకు బియ్యం పంపిణీ కొనసాగుతుందని వెల్లడించారు.
పంపిణీని పర్యవేక్షించండి
కలెక్టర్లు, తహసీల్దార్లు బియ్యం పంపిణీని పర్యవేక్షించాలని, గ్రామ సర్పంచులు ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా దండోరా వేయించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కేవలం ఐరిస్ పనిచేయని వారు, ఓటీపీ రానివారు, ఆధార్‌తో మొబైల్ నెంబర్ సీడింగ్ కాని వారు మాత్రమే ఆధార్ సెంటర్లకు వెళ్లి మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని మంత్రి గంగుల సూచించారు