గణేష్ అంగార్కీ చతుర్థి సందర్భంగా మంగళవారం భక్తులు ముంబైలోని సిద్ధివినాయక దేవాలయం బయట నుంచే పూజలు చేశారు.మహారాష్ట్రలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సిద్ధివినాయక దేవాలయంలోకి క్యూఆర్ కోడ్ ఉన్న ఎంట్రీపాస్ లు పరిమితంగా ఇచ్చి కొందరినే అనుమతించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో కొవిడ్ మార్గదర్శకాలను అమలు చేయడంతో భక్తులు ఆలయం బయట రోడ్డుపై నిలబడి పూజలు చేశారు. కరోనా భయంతో భక్తులు దేవాలయం లోపలకు వెళ్లకుండా రోడ్డుపై నిలబడి దేవుడికి దండం పెట్టారు.మహారాష్ట్రలో కొత్తగా 6,397 కరోనా కేసులు నమదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనాతో 30 మంది మరణించారు.
