బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుదివిడత కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. తుది మెరిట్ జాబితాలోని అభ్యర్థులు కోర్సు, కళాశాలవారీగా ప్రాధాన్యతా క్రమంలో ఈ నెల 23వ తేదీ రాత్రి 7 గంటలలోపు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నది. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
