కాంగ్రెస్‎లో సీట్ల లొల్లి

0
225
Spread the love

కాంగ్రెస్‌ పార్టీలో సీట్ల రగడ మొదలైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అన్ని కూటముల్లో సీట్ల సర్దుబాటు పూర్తవడంతో, ఆయా పార్టీలు అభ్యర్థుల పేర్లు ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా, కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. వచ్చిన దరఖాస్తులను స్ర్కూటీనీ చేసిన టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి జాబితాతో ఢిల్లీ వెళ్లగా, కాంగ్రెస్‌ కార్యాలయంలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సీట్లు అమ్ముకున్నారని, కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఇస్తున్నారని ఆరోపిస్తూ టీఎన్‌సీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్‌ విష్ణుప్రసాద్‌ తన మద్దతుదారులతో కలిసి నిరాహారదీక్షకు దిగారు. ఆయన వైఖరిని ఖండిస్తూ చెన్నై జిల్లా అధ్యక్షుడు ఎంపీ రంజన్‌కుమార్‌ నేతృత్వంలోని మద్దతుదారులు మరోవైపు ఆహారదీక్ష చేపట్టారు. తినుబండారాలు తింటూ, తేనీరు, జ్యూస్‌ సేవిస్తూ ఆ దీక్ష కొనసాగిస్తున్నారు. కాగా, కన్నియకుమారి జిల్లాకు చెందిన సిటింగ్‌ ఎమ్మెల్యే విజయతరణికి సీటు ఇవ్వొద్దంటూ పార్టీ ప్రధాన కార్యాలయం ముందు శనివారం ధర్నా చేపట్టగా, పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారాలపై పార్టీ సీనియర్‌ నేత పి.చిదంబరం మనస్తాపం చెందారు. ఇప్పటికే రాష్ట్రంలో 25 స్థానాలు దక్కించుకునే స్థాయికి పార్టీ పడిపోయిందని, నేతల తీరు ఇలాగే కొనసాగితే ఈ సంఖ్య ఇంకా తగ్గిపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. నేతలెవరూ ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేపట్టకుండా, వేడుక చూస్తున్నారని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here