కాలం తీరినవి..27 లక్షలు

0
165
Spread the love

బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో, కాలం చెల్లిన వాహనాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాల్ని(నాన్‌ కమర్షియల్‌), 15 ఏళ్లు దాటిన రవాణా(కమర్షియల్‌) వాహనాల్నీ తుక్కుకు తరలించే విషయంలో విధివిధానాల్ని త్వరలోనే కేంద్రం ప్రకటించనుంది. రాష్ట్రంలో ఈ తరహా వాహనాల్ని చూస్తే.. సుమారు 27 లక్షల పైచిలుకు వాహనాలు కాలం చెల్లినవి ఉన్నాయి. వీటిలో 6.81 లక్షల వాహనాలు హైదరాబాద్‌లోనే ఉన్నట్లు అంచనా. రాష్ట్రంలో గత ఏడాది మార్చి నెలాఖరునాటికి ఆటో రిక్షాలు, బస్సులు, లారీలు, మ్యాక్సీ కార్లు, మోటార్‌ కార్లు, మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లు ఇలా అన్నీ కలిపి మొత్తం 1.29కోట్ల వరకూ ఉన్నాయి. ఈ 10 నెలల కాలంలో మరో 10 లక్షల వాహనాలు పెరిగి ఉంటాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే రాష్ట్రంలో దాదాపు 1.40 కోట్ల వరకు వాహనాలున్నాయి. వీటిలో 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు 13 లక్షలు, 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలు 14 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.

మోటారు వాహనాల చట్టం (1988) ప్రకారం కాలం చెల్లిన వాహనాలను రోడ్లపై తిప్పడానికి వీల్లేదు. అయితే… ఇంజన్లు బాగానే ఉన్నాయంటూ చాలామంది ప్రతి రెండేళ్లకోసారి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందుతూ వాహనాల్ని నడుపుతున్నారు. కాలం చెల్లిన వాహనాల వలన ప్రమాదాలతో పాటు వాతావరణ కాలుష్యం కూడా ఎక్కువేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27 లక్షల వాహనాలకు కాలం చెల్లినప్పటికీ… వాటిలో 25 శాతం మేర అంబాసిడర్‌, ఫియట్‌, బజాజ్‌ చేతక్‌, లూనాల వంటివే ఉంటాయని రవాణా శాఖ చెబుతోంది. 2000 సంవత్సరం కంటే ముందు తయారైన ఇవి ఇప్పుడు రోడ్లపై తిరగడం లేదు. వాటిని మినహాయిస్తే.. కాలం చెల్లిన ఇతర వాహనాలు దాదాపు 20 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

హైదరాబాద్‌లో 15, 20 ఏళ్లు దాటిన వాహనాలు

ఆటో రిక్షాలు 19955

కాంట్రాక్టు క్యారేజీలు 1776

స్కూలు బస్సులు 862

గూడ్స్‌ వాహనాలు 43883

మ్యాక్సీ క్యాబ్‌లు 1147

మోటార్‌ క్యాబ్‌లు 5149

మోటార్‌ కార్లు 106319

మోటారు సైకిళ్లు 482093

ఇతర వాహనాలు 16204

ప్రైవేటు సర్వీస్‌ వాహనాలు 732

స్టేజీ క్యారేజీలు 2803

ట్రాక్టర్లు, ట్రేలర్లు 985

మొత్తం 681908

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here