కొంచెం ఊరట.. కొంచెం భారం

0
143
Spread the love

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈసారి బడ్జెట్లో పన్ను శ్లాబులను యథాతథంగా కొనసాగించినప్పటికీ పన్ను చెల్లింపుదారులు, డిపాజిట్‌దారులు, సీనియర్‌ సిటిజన్ల కోసం కొన్ని ప్రకటనలు చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో అమల్లోకి రానున్న ఈ మార్పులను గుర్తుంచుకోండి..

బ్యాంక్‌ డిపాజిట్లు

బ్యాంక్‌ డిపాజిట్లపై బీమా కవరేజీని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. అంటే, ఏదేని బ్యాంక్‌ దివాలా తీసిన పక్షంలో, డిపాజిట్‌దారుడికి ఆ బ్యాంక్‌లో దాచుకున్న సొమ్ములో గరిష్ఠంగా రూ.ఐదు లక్షలు వెనక్కి లభించే అవకాశం ఉంటుంది.

యులిప్స్‌

వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలు దాటిన యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ (యులిప్స్‌)కు ఇక పన్ను మినహాయింపు ఉండదు. ఈ ఏడాది ఫిబ్రవరి 21 తర్వాత కొనుగోలు చేసే యులిప్స్‌కు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.

ప్రావిడెంట్‌ ఫండ్‌

మీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఫీఎఫ్‌) ఖాతాలో జమయ్యే వార్షిక సొమ్ము రూ.2.5 లక్షలకు మించితే, దానిపై లభించే వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

జీరో కూపన్‌ బాండ్స్‌

ఇన్‌ఫ్రా డెట్‌ ఫండ్స్‌ కోసం జీరో కూపన్‌ బాండ్స్‌ జారీ చేయ నున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ఈ బాండ్లపై కల్పించే పన్ను ప్రోత్సాహకాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. తద్వారా రిటైల్‌ ఇన్వెస్టర్లకు మరో ఆర్థిక సాధనం అందుబాటులోకి రానుంది. జీరో కూపన్‌ బాండ్లపై వడ్డీ లభించదు. కాకపోతే, వాటి ముఖ విలువపై డిస్కౌంట్‌ ఇస్తారు. బాండ్‌ కాలపరిమితి ముగిసిన తర్వాత ముఖ విలువకు సమానమైన చెల్లింపులు జరుపుతారు.

పన్నులు

బ్యాంక్‌ డిపాజిట్లపై లభించే వడ్డీ లేదా పెన్షన్‌పై ఆధాపడుతున్న 75 ఏళ్లకు పైబడిన సీని యర్‌ సిటిజన్లు ఇకపై ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీ) సమర్పించాల్సిన అవసరం లేదు.

రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ (రీట్స్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ (ఇన్విట్స్‌) నుంచి లభించే డివిడెండ్లపై టీడీఎస్‌ను మినహాయించారు.
డివిడెండ్‌ ఆదాయంపై ముందస్తు పన్ను చెల్లింపులకు ఊరట. డివిడెండ్‌ ఆదాయం చేతి కందిన తర్వాతే పన్ను చెల్లించే వెసులుబాటు.
గృహ రుణగ్రహీతలకు అదనపు ప్రోత్సాహ కాలు కల్పించేందుకు 2019 బడ్జెట్లో ప్రవేశపెట్టిన సెక్షన్‌ 80ఈఈఏ ప్రయోజన గడువును 2022 మార్చి 31 వరకు పొడిగించారు. అంటే, వచ్చే మార్చి చివరినాటికల్లా అందుబాటు గృహాలు (మొదటిసారి) కొనుగోలు చేసే వారు హోమ్‌లోన్‌పై ఏటా రూ.1.50 లక్షల వరకు వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. సెక్షన్‌ 24బీ ప్రకారం గృహ రుణ వడ్డీ చెల్లింపులపై లభించే రూ.2 లక్షల పన్ను మినహాయింపునకు ఇది అదనం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here