క్రికెట్‌ మ్యాచ్‌కు ప్రేక్షకులు షురూ

0
429
Spread the love

కరోనా సంక్షోభంలో ప్రపంచ క్రికెట్‌ అంతా ఒక కోణంలో ముందుక సాగుతుటే, ఇంగ్లండ్‌ మాత్రం అందుకు భిన్నంగా ఉందనే చెప్పాలి. కరోనా వైరస్‌ ఉధృతి ఇంకా కొనసాగుతున్న వేళ.. ఒక క్రికెట్‌ సిరీస్‌ను ఆరంభించి ప్రయోగం చేసింది. ఇంగ్లండ్‌లో వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ఇప్పటికే ముగింపు దశకు రాగా, దాన్ని బయో సెక్యూర్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. కేవలం స్టేడియాల్లోకి ప్రేక్షకులకు అనుమతి ఇవ్వకపోవడం ఒకటైతే, సదరు స్టేడియాలకు అనుసంధానం చేసి ఉన్న హోటళ్లలోనే ఆటగాళ్లను ఉంచి బయో సెక్యూర్‌ విధానంలో సిరీస్‌ను దిగ్విజయంగా ముగించనుంది.

ఇదిలా ఉంచితే, అదే ఇంగ్లండ్‌లో తొలిసారి ప్రేక్షకులు స్టేడియానికి రావడం ఇక్కడ గమనించాల్సి దగిన మరో అంశం. ఇంగ్లండ్‌లో కౌంటీ జట్లైన సర్రే- మిడిల్సెక్స్ ‌ మధ్య ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌ నిర్వహించారు. దీనికి ప్రేక్షకులు అనుమతి ఇస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. సౌత్‌ లండన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు కేవలం వెయ్యి మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. దాంతో అభిమానం స్టేడియానికి తరలివచ్చింది. ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌ కోసం పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చినా అందుకు తాము సిద్ధం అంటూ అభిమానం వెల్లివిరిసింది. రెండు స్టాండ్లకు మధ్య ప్రత్యామ్నాయ వరుసలు వినియోగించి మ్యాచ్‌ చూసేందుకు అనుమతి ఇచ్చారు. గరిష్టంగా ఆరు ఫ్యామిలీ గ్రూపుల మధ్య రెండు సీట్ల అంతరం ఉంచారు. ఇలా ప్రేక్షకుల మధ్య మ్యాచ్‌ను నిర్వహించడం ఇంగ్లండ్‌లో మార్చి తర్వాత ఇదే ప్రథమం.

దీనిపై సర్రే చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌ గౌల్డ్‌ మాట్లాడుతూ… ప్రేక్షకులకు టిక్కెట్లు అందుబాటులోకి వచ్చిన గంటలోపు అందుబాటులో ఉన్న స్థలాల కోసం క్లబ్‌కు సుమారు పది వేల కాల్స్‌ రావడం హర్షించదగ్గ విషయమన్నారు. క్రికెట్‌ మ్యాచ్‌లు తిరిగి ఆరంభమయ్యే క్రమంలో చూడటానికి ప్రేక్షకులు సంతోషంగా ముందుగా రావడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. ఇది కేవలం ఒక మ్యాచ్‌కే పరిమితం కాదని తాను నమ్ముతున్నానని, మున్ముందు చోటు చేసుకునే పరిస్థితులపై ప్రేక్షకులు స్టేడియాలకు రావడం ఆధారపడి ఉంటుందన్నారు. ఈ మ్యాచ్‌ చూడటానికి ప్రభుత్వ తరఫున అధికారులు, భద్రతా అధికారులు దగ్గర్నుంచీ చాలా మంది ప్రజలు వచ్చారు. దీనిపై వారి తుది తీర్పును వెలువరిస్తారన్నారు. అక్టోబర్‌ నుంచి జరుగనున్న సిరీస్‌లకు అధిక సంఖ్యలో ప్రేక్షకులకు అనుమతి ఇచ్చే ఉద్దేశంతోనే ప్రస్తుతం ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌కు ప్రేక్షకుల్ని స్టేడియాలకు రప్పించడం ఒక సన్నాహకంగా ఈసీబీ భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here