ఆరోజు బ్యాట్‌ పట్టుకోవడమే ఇబ్బందిగా మారింది’

0
205
Spread the love

గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన చివ‌రి టెస్ట్‌లో 89* ప‌రుగులు ఇన్నింగ్స్‌తో రిష‌బ్ పంత్ హీరో అవ్వగా.. అంత‌కుముందు 91 ప‌రుగులు చేసిన ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ విజయంలో కీలకంగా మారాడు‌. కానీ వీరిద్దరి మధ్య మరో కీలక ఆటగాడు ఉన్నాడు.. అతనే చతేశ్వర్‌ పుజారా. అత‌డు చేసింది 56 ప‌రుగులే అయినా.. అవే భారత జట్టు మ్యాచ్‌ను గెలిచేలా చేశాయంటే అతిశయోక్తి కాదు. దాదాపు రెండు సెష‌న్ల పాటు ఆసీస్ బౌల‌ర్ల‌ సమర్థంగా ఎదుర్కొంటూ వారినే అల‌సి పోయేలా చేశాడు. పదునైన బౌన్సర్లను సమర్థంగా ఎదుర్కొంటూ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 211 బంతులు ఆడాడు. ఈ క్ర‌మంలో అత‌ని శ‌రీరం మొత్తం గాయాల‌య్యాయి. అతను చూపిన తెగువకు టీమిండియా అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలోనే త‌న వేలికి గాయం కూడా అయింది. తాజాగా పుజారా బ్రిస్బేన్‌లో బ్యాటింగ్‌ ఆడిన తీరు గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు.’మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో నా వేలికి గాయ‌మైంది. దీని కార‌ణంగా సిడ్నీ, బ్రిస్బేన్‌ల‌లో బ్యాటింగ్ చేయడానికి చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. బ్రిస్బేన్‌లో మ‌ళ్లీ అక్క‌డే దెబ్బ త‌గ‌ల‌డంతో గాయం మ‌రింత తీవ్ర‌మైంది. ఆ త‌ర్వాత క‌నీసం బ్యాట్ ప‌ట్టుకోవ‌డానికి కూడా రాలేదు. నాలుగు వేళ్ల‌తోనే బ్యాట్‌ను గ్రిప్ చేయాల్సి వ‌చ్చింది. జట్టును ఓటమినుంచి కాపాడాలనే ప్రయత్నంలో బాధనంతా దిగమింగుకొని ఎలాగోలా ఆడానంటూ’ పుజారా చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here