ఒకే పార్శ్వంలో సెరెనా, ఒసాక

0
223
Spread the love

మెల్‌బోర్న్‌: రికార్డుస్థాయిలో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలోనున్న అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌కు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో క్లిష్టమైన డ్రా ఎదురైంది. సోమవారం నుంచి జరగనున్న ఈ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ డ్రా వివరాలను శుక్రవారం విడుదల చేశారు.

లారా సెగ్మండ్‌ (జర్మనీ)తో తొలిరౌండ్‌ ఆడనున్న సెరెనా ఉన్న పార్శ్వంలోనే రెండో ర్యాంకర్‌ హలెప్‌, ఒసాక, కెర్బర్‌, వీనస్‌ విలియమ్స్‌, బియాంకా ఆండ్రెస్కూలాంటి స్టార్లు ఉన్నారు. ఒసాక మొదటిరౌండ్లో పావ్‌ల్యుచెన్‌కోవా (రష్యా)తో తలపడనుంది. మరో పార్శ్వంలోనున్న డిఫెండింగ్‌ చాంప్‌ సోఫియా కెనిన్‌, నెంబర్‌వన్‌ అష్లే బార్టీ సెమీఫైనల్లో ఎదురుపడే చాన్సుంది. పురుషుల సింగిల్స్‌లో హ్యాట్రిక్‌ టైటిల్‌పై గురిపెట్టిన జొకోవిచ్‌ ఆరంభరౌండ్లో జెరెమీ చార్డీతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఫైనల్‌ చేరే క్రమంలో వావ్రింకా, జ్వెరెవ్‌లాంటి సీడెడ్లను జొకో ఢీకొనాల్సి ఉంటుంది. మరో పార్శ్వం నుంచి లాస్లో జెరెతో ఆరంభ రౌండ్‌ ఆడనున్న నడాల్‌ క్వార్టర్స్‌లో ఐదోసీడ్‌ సిట్సిపా్‌సను ఎదుర్కోనున్నాడు.

72వ ర్యాంకర్‌తో నగాల్‌ ఢీ:

భారత సింగిల్స్‌ ఆటగాడు సుమీత్‌ నగాల్‌ మొదటి రౌండ్లో 72వ ర్యాంకర్‌ రికర్డాస్‌ బెరాన్కిస్‌ (లాత్వియా)తో తలపడనున్నాడు. డబుల్స్‌లో రోహన్‌ బోపన్న, దివిజ్‌ పోటీపడనున్నారు.

విలియమ్స్‌కు గాయం

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు సన్నాహకంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌ చేరిన సెరెనా విలియమ్స్‌ ఆ మ్యాచ్‌ నుంచి తప్పుకొంది. కుడి భుజం నొప్పి కారణంగా టాప్‌సీడ్‌ అష్లే బార్టీతో ఆడాల్సిన సెమీస్‌ పోరు నుంచి వైదొలగినట్టు సెరెనా తెలిపింది. అయితే, గాయం తీవ్రమైనది కాకపోవడంతో సెరెనా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here