గర్ల్‌ఫ్రెండ్ పుట్టిన రోజును ఘనంగా జరిపేందుకు స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో కొవిడ్ నిబంధనలను అతిక్రమించాడు. ప్రస్తుతం ఇటలీలో ఉన్నఈ యువెంటస్ ప్లేయర్ తన ప్రేయసి జార్జినాతో కలిసి గత మంగళవారం ట్యురిన్ నుంచి 150కి.మీ దూరంలోని ఓ పర్వత రిసార్ట్‌కు వెళ్లాడు.
ఇటలీ నిబంధన ప్రకారం ఎవరూ ట్యురిన్ నుంచి బయటకు వెళ్లకూడదు. స్నోమొబైల్‌పై కూర్చున్న తామిద్దరి ఫొటోను రొనాల్డో ప్రేయసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో విషయం బయటికి వచ్చింది. అయితే వివాదం కావడంతో వెంటనే ఆ ఫొటోను తొలగించింది.
ఒకవేళ నిబంధనలు అతిక్రమించినట్టు తేలితే ఈ ఇద్దరిపై 485 డాలర్ల (రూ.35వేలు) చొప్పున జరిమానా విధించే అవకాశం ఉంది