బాక్సమ్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీకోమ్ సెమీ్‌సలో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకొంది. పూజారాణి, సిమ్రన్‌జిత్ కౌర్, జాస్మిన్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల 51 కేజీల సెమీ్‌సలో వర్జీనియా ఫుచ్స్ (అమెరికా) చేతిలో పోరాడి ఓడిన మేరీకోమ్‌కు కాంస్యం దక్కింది. ఇతర సెమీఫైనల్స్‌లో ఎథీనా బైలాన్ (75)పై పూజారాణి, కిరియా తపియా (60 కేజీలు)పై సిమ్రన్ జిత్, సిరినే చరాబిని (57 కేజీలు)పై జాస్మిన్ గెలుపొందారు. పురుషుల క్వార్టర్స్‌లో సతీష్ (+91) 5-0 స్కోరుతో గివ్‌స్కోవ్ నిల్సెన్ (డెన్మార్క్)పై, ఆశీష్ (75 కేజీలు) 4-1తో రెమో స్లావట్టి (ఇటలీ)పై, సుమిత్ (81 కేజీలు) 4-1తో మొహర్ ఈ జియాద్ (బెల్జియం)పై గెలుపొందారు.
